E-Paper
Advertisement

ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!

ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!
Advertisement

Revanth Reddy: ఎల్‌నినో దెబ్బకు వర్షాలు మొహం చాటేయడం.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు అలుముకోవడంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలకు సిద్ధమవుతోంది. వర్షపాతం తగ్గడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు ఈ నెల 12న మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

అజెండాలో కీలక అంశాలు

Advertisement

ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, విపరీతంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. వర్షాలు సరిగ్గా పడని ప్రాంతాల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలి? తక్షణమే చేపట్టాల్సిన సహాయక చర్యలేంటి? అనే దానిపై ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు.

అసెంబ్లీ తీర్మానం.. కేంద్రానికి విజ్ఞప్తి

Advertisement

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉండి వర్షాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం అందించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరారు.

అందరి సలహాలతో ముందుకు..

మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రూపొందించిన ప్రణాళికతో పాటు, రాబోయే రోజుల్లో నిర్వహించే అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల నుంచి వచ్చే సలహాలు, సూచనలను ఈ భేటీలో చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, కష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

Also Read: జ్ఞానేష్ కుమార్ మోదీకి బానిస!.. అఖిలపక్ష భేటీలో ఫైర్ అయిన వైఎస్ షర్మిల

Tags

Related News

పల్నాడు గ్రిడ్ ప్రాజెక్టుపై.. కేఆర్ఎంబీ చైర్మన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!

అగ్రి యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త కోర్సులు ప్రారంభం!

నెలకు రూ.లక్ష వేతనంతో.. 11 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్నీ మీ సేవలో..?

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!

బౌరంపేటలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందా కలకలం

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

Big Stories

Advertisement
×