Best water purifier for borewell supply: ఇళ్లలో బోర్‌వెల్ నీటిని వాడుతున్నారా? అయితే.. అందులో ఉండే కరిగిన లవణాలు, హానికరమైన రసాయనాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. మున్సిపల్ వాటర్ లా కాకుండా.. బోర్ నీటిలో మలినాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే.. మీ కుటుంబ ఆరోగ్యం కాపాడటానికి ఒక పవర్ ఫుల్ వాటర్ ప్యూరిఫైయర్ చాలా ముఖ్యం. బోర్‌వెల్ నీటి కోసం రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉన్న ప్యూరిఫైయర్లు మాత్రమే వాడటం మంచిది. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 5 RO వాటర్ ప్యూరిఫైయర్లు,వాటి ధరల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అధిక TDS స్థాయిలను తొలగిస్తుంది: బోర్‌వెల్ నీటిలో లవణాలు, ఖనిజాలు మోతాదుకు మించి ఉంటాయి. RO టెక్నాలజీ ఈ హై TDS నీటిని సురక్షితమైన, తియ్యటి తాగునీరుగా మారుస్తుంది.
భారీ లోహాలు తొలగింపు: బోర్‌వెల్ నీటిలో ఆర్సెనిక్, లెడ్, ఫ్లోరైడ్ వంటి ప్రమాదకరమైన లోహాలు ఉంటాయి. RO మెంబ్రేన్ వీటిని పూర్తిగా ఫిల్టర్ చేస్తుంది.
బ్యాక్టీరియా, వైరస్ నాశనం: RO తో పాటు వచ్చే UV, UF టెక్నాలజీ నీటిలోని హానికరమైన సూక్ష్మజీవులను, బాక్టీరియాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది.
దుర్వాసన, రంగు తొలగింపు: బోర్‌వెల్ నీటిలో ఉండే రంగు మారడం , విచిత్రమైన వాసనను కార్బన్ ఫిల్టర్లు తొలగించి, నీటిని స్వచ్ఛంగా మారుస్తాయి.
మెరుగైన ఆరోగ్యం: కలుషితమైన బోర్‌వెల్ నీటి వల్ల వచ్చే కడుపు నొప్పి, వాంతులు , ఇతర సమస్యల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది.
బోర్‌వెల్ నీటి కోసం ఇది మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇది నీటిని వృథా చేయకుండా ఎక్కువ నీటిని సేవ్ చేస్తుంది. 10 లీటర్ల స్టోరేజ్, ట్రిపుల్ సేఫ్టీ మినరల్ కార్ట్రిడ్జ్ దీని ప్రత్యేకతలు.
ధర: సుమారు రూ. 14,999.
ప్రముఖ బ్రాండ్ అయిన యూూరేకా ఫోర్బ్స్ నుంచి వచ్చిన ఈ మోడల్ బోర్‌వెల్ వాటర్‌లోని హై టీడీఎస్‌ను ఈజీగా ఫిల్టర్ చేస్తుంది. ఇది యాక్టివ్ కాపర్ టెక్నాలజీ నీటిలో రాగి గుణాలను యాడ్ చేస్తుంది.
ధర: సుమారు రూ. 12,999.
బొరివెల్ నీటిలో బాక్టీరియా , కఠినమైన మలినాలను తొలగించడంలో ఏఓ స్మిత్ ప్యూరిఫైయర్లు చాలా పేరుగాంచాయి. బేబీ సేఫ్ వాటర్, 100% RO ప్యూరిఫికేషన్ దీని ప్రత్యేకతలు.
ధర:సుమారు రూ.19,499.
తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కోరుకునే వారికి వీ-గార్డ్ జెనోరా పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిని బోర్‌వెల్, ట్యాంకర్ నీటి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసారు. 7 దశల వడపోత ప్రక్రియ, LED ఇండికేటర్లు దీనిలో ఉంటాయి.
ధర:సుమారు రూ.9,999.
Also Read: అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!
స్మార్ట్ ఫీచర్లు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మొబైల్ యాప్ ద్వారా దీని వాటర్ క్వాలిటీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ TDS మానిటరింగ్, 5-స్టేజ్ డీప్ ప్యూరిఫికేషన్ దీని ప్రత్యేకతలు.
ధర: సుమారు రూ.13,999.
మీ ఇంట్లో బోర్‌వెల్ సప్లై ఉంటే.. సాధారణ ఫిల్టర్లు సరి పోవు. మీ కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హై క్వాలిటీ RO వాటర్ ప్యూరిఫైయర్‌ను తీసుకోవడం చాలా ముఖ్యం. మీ బడ్జెట్, నీటి నాణ్యత ఆధారంగా పై మోడల్స్‌లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి!