E-Paper
Advertisement

మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు

మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు
Advertisement

Horror Short film : హారర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ కేవలం 18 నిమిషాల్లోనే ప్రేక్షకుడిలో భయం పుట్టించే షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చాలా అరుదు. అలాంటి డార్క్ సైకాలజికల్ హారర్ షార్ట్ ఫిల్మ్ ‘Stucco’. 2019లో విడుదలైన ఈ అమెరికన్ షార్ట్ హారర్ చిత్రానికి జనీనా గవాంకర్, రుస్సో షెల్లింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో జనీనా గవాంకర్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా కథను కూడా రచించారు.

స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

Stucco 2019 ఆగస్టు 8న విడుదలైంది. దీని నిడివి కేవలం 18 నిమిషాలు మాత్రమే. ప్రస్తుతం ఇది భారత్‌లో ఏ ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ స్ట్రీమింగ్‌లో లేదు. అయితే ఇది యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

‘జే’ అనే మహిళ తీవ్ర అగోరాఫోబియా (ఇంటి బయటకు వెళ్లాలంటే భయపడే మానసిక సమస్య)తో బాధపడుతూ ఒంటరిగా తన ఇంట్లోనే జీవిస్తుంది. ఆమె ఆరోగ్యం కూడా రోజురోజుకూ క్షీణిస్తుంటుంది. ఒక రోజు ఇంటి గోడలో చిన్న రంధ్రం కనిపిస్తుంది. మొదట దాన్ని పెద్దగా పట్టించుకోదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ రంధ్రం క్రమంగా పెద్దదవుతూ ఉండటం ఆమెను కలవరపెడుతుంది. ఆ గోడ వెనుక ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలవుతుంది. అందులో నుంచి ఒక నాలుక బయటికి వచ్చి ఆమెను మరింత భయపెడుతుంటుంది.

ఆమె చూసేది నిజమా? లేక తన మానసిక పరిస్థితి వల్ల కలిగిన భ్రమలా? గోడ వెనుక నిజంగా ఏముంది? ఆ వింత ఆమె జీవితాన్ని ఎలా మార్చింది? అనే ప్రశ్నల చుట్టూనే ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతుంది. ఇందులో చివరి వరకు దర్శకులు స్పష్టమైన సమాధానాల కంటే ప్రేక్షకుల ఊహకు ఎక్కువ స్థానం ఇస్తారు. అందుకే ముగిసిన తర్వాత కూడా ఈ కథ గురించి ఆలోచించేలా చేస్తుంది.

ఎందుకు చూడాలి?

Advertisement

‘Stucco’లో సాధారణ హారర్ సినిమాల్లో కనిపించే జంప్ స్కేర్స్ చాలా తక్కువ. బదులుగా భయానక వాతావరణం, సౌండ్ డిజైన్, విజువల్, మానసిక సంఘర్షణల ద్వారా భయాన్ని సృష్టించారు. జనీనా గవాంకర్ నటన ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రధాన బలం. కేవలం 18 నిమిషాల నిడివిలోనే ఒంటరితనం, భయం, మానసిక క్షోభను ప్రభావవంతంగా చూపించారు. Psychological Horror, Body Horror, Slow Burn Horror కథలు ఇష్టపడేవారికి ‘Stucco’ ఒక ఆసక్తికరమైన అనుభవం. అయితే ఇది కమర్షియల్ హారర్ కాకుండా ఆర్ట్‌హౌస్ శైలిలో సాగే సినిమా అని గుర్తుంచుకోవాలి.

Read Also : టీచర్ పైనే అఘాయిత్యం… మోస్ట్ డిస్టర్బింగ్ రియాలిటీకి కళ్ళకు కట్టిన లీగల్ డ్రామా

Tags

Related News

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

రూ.550 కోట్ల హారర్ బ్లాక్‌బస్టర్… ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఏకంగా 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో

గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్

బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఒరిజినల్ ఏనుగుతో షాకింగ్ యాక్షన్… తెలుగులోనే సునీల్ మలయాళం మూవీ ‘కాటాలన్’ స్ట్రీమింగ్

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×