E-Paper
Advertisement

సాధువు శాపం.. తాంత్రికుడి మరణం.. రత్నావతి ప్రేమకథలో ఇంత భయంకరమైన ట్విస్ట్ ఉందా?

సాధువు శాపం.. తాంత్రికుడి మరణం.. రత్నావతి ప్రేమకథలో ఇంత భయంకరమైన ట్విస్ట్ ఉందా?
Advertisement

Bhangarh Fort Mystery: దేశంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వాటి నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందితే.. మరికొన్ని వాటి చుట్టూ అల్లుకున్న రహస్యాలు, ఆసక్తికరమైన కథలతో ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లోని భంగర్ కోట కూడా అలాంటి వాటిలో ఒకటి. పగటిపూట అందమైన ప్రకృతి, పురాతన కట్టడాలతో ఆకట్టుకునే ఈ ప్రాంతం.. చీకటి పడిన తర్వాత దెయ్యాల కోటగా  పేరుపొందింది.

కొండల మధ్య చారిత్రక కోట!

భంగర్ కోట రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో పచ్చని కొండల మధ్య ఉంది. 17వ శతాబ్దంలో రాజా మధో సింగ్ ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన అంబర్‌ కు చెందిన మొఘల్ కమాండర్ మాన్ సింగ్‌కు సోదరుడు. ఒకప్పుడు భంగర్ ప్రాంతం ఎంతో వైభవంగా ఉండేది. 1720 నాటికి ఇక్కడ 9,000కు పైగా ఇళ్లు ఉన్నట్లు చరిత్ర చెప్తోంది. కాలక్రమంలో ఈ ప్రాంతం జనావాసాలను కోల్పోయింది. ప్రస్తుతం కోట పరిసరాల్లో పాత ఇళ్లు, దేవాలయాలు, మార్కెట్ల అవశేషాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు ఇక్కడ ఉన్న నగర వైభవాన్ని గుర్తుచేస్తుంటాయి.

సూర్యాస్తమయం తర్వాత కోటలోకి నిషేధం!

Advertisement

భంగర్ కోటకు చారిత్రక ప్రాధాన్యంతో పాటు అక్కడ ప్రచారంలో ఉన్న భయానక కథలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. స్థానికంగా వినిపించే కథనాల ప్రకారం కోట పరిసరాల్లో రాత్రివేళ వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్తారు. కొందరు మహిళ ఏడుపు, గాజుల శబ్దం, అరుపులు విన్నట్లు చెప్పుకుంటారు. ఈ నమ్మకాల కారణంగానే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కోటలోకి సందర్శకులను అనుమతించరని ప్రచారం ఉంది. అయితే, ఈ ప్రాంతానికి సంబంధించిన అతీంద్రియ కథలకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవు. ఇవి  స్థానిక ప్రజల్లో ఉన్న కథలే.

సాధువు పెట్టిన షరతు!

భంగర్‌కు సంబంధించిన ప్రసిద్ధ కథల్లో ఒకటి బాబా బలౌ నాథ్ అనే సాధువుకు సంబంధించినది. కోట నిర్మాణానికి ముందు ఆయన ఈ ప్రాంతంలో ధ్యానం చేసేవారని చెబుతారు. కోట నిర్మించేందుకు అనుమతిస్తూ.. తన నివాసం కంటే ఎత్తుగా ఎలాంటి నిర్మాణం ఉండకూడదని రాజుకు షరతు పెట్టాడట. తన ఇంటిపై కోట నిర్మాణం నీడ పడితే మొత్తం నగరం నాశనమవుతుందని కూడా హెచ్చరించాడట. అయితే, మధో సింగ్ మనవడు అజబ్ సింగ్ ఈ నిబంధనను పట్టించుకోకుండా కోటను మరింత ఎత్తుగా నిర్మించాడని చెబుతారు. ఆ తర్వాత సాధువు చెప్పినట్లుగానే నగరం నాశనమైందనే కథ ప్రచారంలోకి వచ్చింది.

యువరాణి రత్నావతి కథ!

Advertisement

భంగర్ కోటకు సంబంధించిన మరో ప్రముఖ కథ యువరాణి రత్నావతిది. ఆమె ఎంతో అందంగా ఉండేదట. ఆమె అందానికి ముగ్ధుడైన ఓ తాంత్రికుడు.. యువరాణి ఉపయోగించే పరిమళ ద్రవ్యంలో మాయా కషాయం కలిపాడట. అయితే, అతడి మోసాన్నిగుర్తించిన యువరాణి ఆ పరిమళాన్ని ఓ పెద్ద రాయిపై విసిరేసిందట. మాయా ప్రభావంతో ఆ రాయి తాంత్రికుడి వైపు దూసుకెళ్లి అతడిని నలిపేసిందని చెబుతారు. మరణించే ముందు అతడు భంగర్ నగరం నాశనం కావాలని శపించాడట. కొంతకాలానికి యుద్ధంలో భంగర్ రాజ్యం దెబ్బతిని, కోటలోని ప్రజలు ప్రాణాలు కోల్పోయారని కథలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అక్కడి ఆత్మలు సంచరిస్తున్నాయనే నమ్మకం కొనసాగుతోంది. చరిత్ర, వాస్తుశిల్పం, ప్రకృతి అందాలతో పాటు ఇలాంటి రహస్య కథలు భంగర్ కోటకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నా.. ఈ కథలే భంగర్‌ కోటను ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశంగా మార్చాయి.

Read Also: ఇళ్లుంటాయి.. జనాలు ఉంటారు.. కానీ, అక్కడ ఊర్లకు పేర్లు ఉండవు, ఎందుకంటే?

Tags

Related News

మంచు కరిగితే బయటపడే వందలాది అస్థిపంజరాలు.. రూప్‌కుండ్ సరస్సు వందల ఏళ్ల మిస్టరీ!

దెయ్యాల కథలు, రహస్య ప్రదేశాలు.. ఇండియాలో కొత్త ట్రావెల్ ట్రెండ్

హోటల్ గదిలో రహస్య కెమెరాలు.. కచ్చితంగా చెక్ చేయాల్సిన 10 సీక్రెట్ ప్రదేశాలు!

కాజీపేట రైల్వే స్టేషన్ ఇక ఫుల్ మోడ్రన్.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

దసరా, దీపావళి ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్.. చర్లపల్లి నుంచి 38 స్పెషల్ ట్రైన్లు!

గణేష్ నిమజ్జనం వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, రాత్రంతా స్పెషల్ MMTS రైళ్లు!

రైడ్‌కు ముందు టిప్ ఎందుకు? క్యాబ్ యాప్‌ లకు కేంద్రం షాక్!

Big Stories

Advertisement
×