Nara Rohith Baby: నారా ఫ్యామిలీలో సరికొత్త సంతోషం వెల్లివిరిసింది. టాలీవుడ్ వెర్సటైల్ హీరో నారా రోహిత్ (Nara Rohith), ఆయన భార్య, నటి సిరి లేళ్ల (Siree Lella) దంపతులు తల్లిదండ్రులయ్యారు. సిరి లేళ్ల మగబిడ్డకు (Baby Boy) జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, అటు నారా-నందమూరి అభిమానుల్లోనూ తెగ వైరల్ అవుతోంది.
Read also-పవన్ కళ్యాణ్ ‘OG 2’ గురించి అర్జున్ దాస్ షాకింగ్ కామెంట్స్..!
‘ప్రతినిధి 2’ తో మొదలైన బంధం
నారా రోహిత్ హీరోగా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’ సినిమా ద్వారా సిరి లేళ్ల టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో గత ఏడాది ఈ జంట వివాహ బంధంతో ఒకటైంది. రీల్ లైఫ్ కపుల్‌గా మెప్పించిన వీరిద్దరూ.. రియల్ లైఫ్‌లోనూ జంటగా మారి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. నారా రోహిత్, సిరి లేళ్లకు కుమారుడు జన్మించాడనే విషయం తెలియడంతో ట్విట్టర్ (X) వేదికగా అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.