E-Paper
Advertisement

మావయ్య సినిమాకు అల్లుడు క్లాప్.. అమరావతిలో ‘NBK112’ గ్రాండ్ లాంచింగ్!

మావయ్య సినిమాకు అల్లుడు క్లాప్.. అమరావతిలో ‘NBK112’ గ్రాండ్ లాంచింగ్!
Advertisement

NBK112 Launch: నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK112 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ జరిగిన ఈ సినిమా ముహూర్తపు వేడుకలో ఒక అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ చోటుచేసుకుంది. బాలకృష్ణ క్లాప్‌బోర్డ్ పట్టుకోగా, ఆయన అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మావయ్య చిత్రానికి మొదటి క్లాప్ కొట్టారు. ఈ రేంజ్ హై-ప్రొఫైల్ సినిమా ఓపెనింగ్ హైదరాబాద్‌ను దాటి అమరావతిలో జరగడం, నందమూరి-నారా అభిమానులను ఒకే ఫ్రేమ్‌లో ఖుషీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది.

Read also-Podarillu Today Episode : చక్రీని దారుణంగా తిట్టిన మాధవ్..కేశవతో శైలు ట్రాక్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Advertisement

ఈ ప్రతిష్టాత్మక చిత్రం అటు బాలయ్య కెరీర్‌లోనే కాకుండా, ఇటు దర్శకుడు కొరటాల శివకు కూడా అత్యంత కీలకంగా మారింది. ఒకప్పుడు వరుస సోషల్ మెసేజ్ బ్లాక్‌బస్టర్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన కొరటాలకు, ఈ ప్రాజెక్ట్ తన సత్తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సరైన సమయం. బాలకృష్ణ లాంటి పవర్‌హౌస్ మాస్ హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా తన మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్స్‌ను, ఊరమాస్ ఎలిమెంట్స్‌ను ఏ స్థాయిలో మిక్స్ చేస్తారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. టాప్ లీగ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి కొరటాల శివ ఈ సినిమాపై గట్టి పందెమే కాస్తున్నట్లు కనిపిస్తోంది.

Read also-రాజమౌళి ‘వారణాసి’ సెట్స్‌లో షాకింగ్ విషయాలు బయటపెట్టిన పృథ్వీరాజ్!

Advertisement

వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఫామ్‌లో ఉన్న బాలయ్య, హై-వోల్టేజ్ డ్రామాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కొరటాల చేతులు కలపడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్.. కొరటాల క్లాస్-మాస్ మేకింగ్ తోడైతే థియేటర్లలో రికార్డుల వేట ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. ఎన్టీఆర్ కు దేవరతో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాల శివ బాలయ్యతో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి.

Related News

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

అక్కినేని కోడలు క్రేజ్ మాములుగా లేదుగా… ఏకంగా

జానీ మాస్టర్ భార్య పై దాడి..పోలీసులను ఆశ్రయించిన సుమలత!

నాని ‘ప్యారడైజ్’కి తొలిరోజే రూ.100 కోట్లా?ఆశకు హద్దుండాలి గురూ !

Big Stories

Advertisement
×