E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్ వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!

ఈశ్వర్ సాయి వైఫ్ కామెంట్స్‌పై శేఖర్  వైరస్ సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పకపోతే అంతే!
Advertisement

Eeshwar Sai Wife Controversy:ఈశ్వర్ సాయి ,మాధురి రాథోడ్ ల వ్యవహారం రాజేసిన మంటలు ఇప్పట్లో ఆగేలా చల్లారేలా కనిపించట్లేదు.ఈ క్రమంలోనే తాజాగా ఈశ్వర్ సాయి భార్య ఫోక్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.అయితే వీటిపై స్పందించిన శేఖర్ వైరస్ (Shekar Virus) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈశ్వర్ సాయి (Eeshwar Sai) భార్య ఇటీవల ఫోక్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఫోక్ రంగానికి ఆమె తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జానపద రంగానికి అవమానం సహించం

గడిచిన ఎనిమిదేళ్లుగా తాను జానపద రంగానికే కాకుండా అనేక సినిమాల్లో డ్యాన్సర్‌గా, కళాకారుడిగా సేవలు అందిస్తున్నానని శేఖర్ వైరస్ గుర్తుచేశారు. ఈశ్వర్ సాయి కుటుంబంలో తలెత్తిన వ్యక్తిగత వివాదాలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఫోక్ రంగాన్ని లాగడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు.

Advertisement

“మీ ఇంట్లో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి మీ వ్యక్తిగతం. అంతేకాని వాటిని ఫోక్ ఇండస్ట్రీకి ముడిపెట్టి మాట్లాడటం సరైన పద్ధతి కాదు” అని మండిపడ్డారు.

అలాంటి రంగానికి మచ్చ తెచ్చేలా మాట్లాడితే

తెలంగాణ జానపద రంగానికి సుదీర్ఘ చరిత్ర మరియు గొప్ప సంస్కృతి ఉందనే విషయాన్ని గుర్తించాలని శేఖర్ వైరస్ చెప్పారు. “ఈ ఇండస్ట్రీలో ఎంతోమంది మంచి సంస్కారం ఉన్న అమ్మాయిలు, ప్రతిభావంతులైన డ్యాన్సర్లు ఉన్నారు. కేవలం ఒకరిద్దరి ప్రవర్తన ఆధారంగా మొత్తం ఫోక్ ఇండస్ట్రీనే తక్కువ చేసి మాట్లాడటం కేవలం ముమ్మాటికీ తప్పే” అని అన్నారు.
ఫోక్ ఇండస్ట్రీ ఆధారంగా చేసుకుని ఎన్నో పేద కుటుంబాలు, కళాకారులు జీవనం సాగిస్తున్నారని, అలాంటి రంగానికి మచ్చ తెచ్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

also read:ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!

ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే

ఈ సందర్భంగా శేఖర్ వైరస్ ఒక డిమాండ్ పెట్టారు. ఫోక్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను ఈశ్వర్ సాయి భార్య ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతె సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, వివాదాలకు ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇకపై ఎవరైనా ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడితే చట్టపరమైన, సామాజికపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీనియర్ కళాకారుల మద్దతు

ఇక ఈ వివాదంలో సీనియర్ డ్యాన్స్ మాస్టర్లు మరియు రంగానికి చెందిన ఇతర ప్రతినిధులు కూడా శేఖర్ వైరస్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. గత 20 ఏళ్లుగా జానపద కళలను, పాటలను ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లామని, అటువంటి పవిత్రమైన వేదికపై ఇటువంటి మచ్చ పడటం బాధాకరమని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

also read:తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు మరియు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ప్రస్తుతం ఈ వివాదం బాగా ట్రెండ్ అవుతోంది.

Tags

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Big Stories

Advertisement
×