Allari Naresh – Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush)తాజాగా కుబేర సినిమా (Kuberaa) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు విడుదలై ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో మొదటిసారి ధనుష్ బెగ్గర్ (Begger)పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఇలా బెగ్గర్ పాత్రలో ఈయన చాలా అద్భుతంగా నటించారని తన పాత్రకు ప్రాణం పోసారు అంటూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అయితే తెలుగులో కూడా ఇలా బెగ్గర్ పాత్రలో నటించిన హీరోలు ఉన్నారని తెలుగు హీరోని ధనుష్ బీట్ చేయలేకపోయారని చెప్పాలి. మరి తెలుగులో దగ్గరగా నటించిన హీరో ఎవరు? ఏంటి? అనే విషయానికి వస్తే…
పెళ్లయింది కానీ.. సినిమా
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అల్లరి నరేష్ (Allari Naresh) ఒకరు. అల్లరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి ఇవివిసత్యనారాయణ దర్శకత్వంలో అల్లరి నరేష్ కమలిని ముఖర్జీ జంటగా నటించిన చిత్రం “పెళ్లయింది కానీ” (Pellaindi Kaani). ఈ సినిమా 2007 అక్టోబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో తల్లి కొడుకు భార్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
బెగ్గర్ పాత్రలో అల్లరి నరేష్..
ఈ సినిమాలో అల్లరి నరేష్ కు వయసుకు తగ్గ తెలివితేటలు ఉండవు అయినప్పటికీ హీరోయిన్ తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడంతో నటి కమలిని ముఖర్జీ మరొక వివాహం చేసుకుంటుంది. అల్లరి నరేష్ తల్లి పాత్రలో నటించిన భానుప్రియ చనిపోయిన తర్వాత రోడ్డున పడ్డ నరేష్ ఒకానొక సమయంలో బెగ్గర్ గా కనిపిస్తారు అయితే బెగ్గర్ గా ఈయన పోషించిన ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉందని, ఇప్పటికి కూడా ఏ హీరోలు ఈయన నటనకు సమానంగా నటించలేకపోయారని చెప్పాలి.
Let’s not forget about my boy @allarinaresh he has done it then https://t.co/M6Bk7Odbo3 pic.twitter.com/mpGHDWBLfD
— Ram (@vibeofabhi) June 20, 2025
ఇలా చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగులో ధనుష్ (Begger) నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈయన అద్భుతంగా నటించినప్పటికీ హీరో అల్లరి నరేష్ నటన ముందు తేలిపోయారని చెప్పాలి. ప్రస్తుతం కుబేర సినిమా విడుదల కావడంతో అల్లరి నరేష్ సినిమాలోని ఈ సన్నివేశాన్ని కూడా వైరల్ చేస్తున్నారు. అయితే అల్లరి నరేష్ కూడా అప్పట్లోనే ఎంతో అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఇక కుబేర విషయానికి వస్తే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటుంది. మొదటి రోజే అన్ని ప్రాంతాలలో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇలా శేఖర్ కమ్ముల కుబేర సినిమా ద్వారా తన మార్క్ ఏంటో నిరూపించారు. ఇక ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించిన అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
Also Read: పుష్ప2 సినిమాపై శేఖర్ కమ్ముల కామెంట్స్.. ఎంజాయ్ చెయ్యలేను అంటూ!