BigTV English

HHVM Movie : పాపం కొత్త డిస్ట్రిబ్యూటర్లు… పరువు మొత్తం తీస్తున్నారు

HHVM Movie : పాపం కొత్త డిస్ట్రిబ్యూటర్లు… పరువు మొత్తం తీస్తున్నారు


HHVM Distributors Details: హరి హర వీరమల్లు వల్ల ఇండస్ట్రీలో ఎప్పుడు లేని కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో మూవీ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో మొత్తం ఈ సినిమా గురించే చర్చ. మరోవైపు ట్రోల్స్, మీమ్స్. మూవీ విడుదలకు ఇంకా వారం కూడా లేదు. జూలై 24న మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనే లేదు. ట్రోల్స్ చేస్తూ.. ప్రమోషన్స్ మొదలు పెట్టండ్రా బాబూ అంటూ ఫ్యాన్స్ అంత గించుకుంటున్నారు.


వీరమల్లు విడుదల కష్టాలు

మరోవైపు ఈ సినిమాకు డిస్ట్రీ బ్యూటర్లు, బయ్యర్ల విషయం కాస్తా వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ముందు వరకు మూవీపై పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా తరచూ షూటింగ్స్ కి బ్రేక్ రావడం, డైరెక్టర్లు మారడంతో వీరమల్లు నమ్మి కొనేందుకు బయ్యర్లు ముందుకు రాలేదు. ఇక ట్రైలర్ తర్వాత మూవీపై ఒక్కసారిగా బజ్ పెరిగింది. అప్పటి వరకు వెనక్కి వెళ్లిన బయ్యర్లు సినిమా కొనేందుకు పోటీ పడ్డారు. కానీ, ఏఎం రత్నం రూ. 50 కోట్లు పలికాడు. దీంతో అక్కడ వీరమల్లు బేరాలు దగ్గరే ఆగిపోయింది. నైజాం పెద్దయిన దిల్ రాజు సైతం నిర్మాత డిమాండ్ మేరకు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. మిగతా ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. రేట్ తగ్గించాలని కోరిన ఏఎం రత్నం తగ్గడంలేదు. దీంతో ఈ సినిమాకు పాత వాళ్ల కంటే కొత్త బయ్యర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

హరి హర వీరమల్లు డిస్ట్రిబ్యూటర్స్

ఏరియా వారిగా ఈ సినిమా సొంతం చేసుకున్న బయ్యర్ల వివరాలు ఇలా ఉన్నాయి. డీవీడీ సుబ్బరావు / క్రౌన్ సుబ్బరావు ఇతను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్. నైజాం ఏరియా 40 కోట్లు మూవీ రైట్స్ తీసుకున్నారు. అలాగే నెల్లూరులోనూ ఈయనే తీసుకున్నట్టు తెలుస్తోంది. పోర్టు సతీష్ అనే అతను వైజాగ్ రైట్స్ దక్కించుకున్నాడట. సుమారు రూ. 12 కోట్ల ఈ సినిమాను కొన్నాడట. అయితే మొదట సీడెడ్ రైట్స్ ని దీప్ ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ్. దాదాపు రూ. 24 కోట్లకు కొన్నాడట. తర్వాత ఏమైందో తెలియదు కానీ, మూవీ వదలుకున్నాడు. దీంతో సీడెడ్ లో పాకాల మురళి మూవీని తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంతా నిర్మాత ఏఎం రత్నంకు అత్యంత సన్నిహితులని సమాచారం. అందుకే దిల్ రాజు, మైత్రీ లాంటి టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా.. వీరి చేతికి రైట్స్ వచ్చాయి.

టాప్ బ్యానర్ల పట్ల నిర్మాత మొండి వైఖరి

అది కూడా నిర్మాత అనుకున్న ధరకు హరి హర వీరమల్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో అగ్ర హీరో అయిన పవన్ కళ్యాణ్ సినిమా కొత్త డిస్ట్రీబ్యూటర్స్ చేతికి వెళ్లడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సోషల్ మీడియోలో దీనిపై ట్రోల్స్, మీమ్స్ చేస్తూ ఆటాడుకుంటున్నారు. హరి హర వీరమల్లు డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి అంటూ ఓ వీడియో విడుదల చేశారు.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇందులో పాపం కొత్త డిస్ట్రిబ్యూటర్లను ట్రోల్ చేస్తున్నట్టుగా కనిపించింది. ట్రైలర్ తర్వాత హరి హర వీరమల్లుపై బజ్ పెరగడంతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాని కొనేందుకు ముందుకు వచ్చిన.. నిర్మాత మొండి వైఖరి కారణంగా టాప్ బ్యానర్లకు వెళ్లాల్సిన ఈ సినిమా చిన్న డిస్ట్రిబ్యూటర్ల చేతికి వెళ్లిన పరిస్థితి వచ్చింది.

Also Read: Prabhas-jr NTR: విగ్గు లేకుండ ప్రభాస్.. ముడతల ముఖంతో ఎన్టీఆర్, స్టార్ హీరోల ఫ్యాన్ వార్.. అసలేం జరుగుతోంది?

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×