BigTV English

OTT Movie : ప్రపంచాన్ని తుడిచి పెట్టేసే వైరస్… ఒక్కో సీన్ క్లైమాక్స్ లా… దిమ్మతిరిగే ట్విస్టులు

OTT Movie : ప్రపంచాన్ని తుడిచి పెట్టేసే వైరస్… ఒక్కో సీన్ క్లైమాక్స్ లా… దిమ్మతిరిగే ట్విస్టులు

OTT Movie : హైస్కూల్ డ్రామాతో జోంబీ థ్రిల్‌ను ఇస్తున్న ఒక కొరియన్ అపోకలిప్స్ సిరీస్ ఓటీటీలో దుమ్ముదులుపుతోంది. ఈ సిరీస్ హ్యోసాన్ అనే నగరంలోని జోంబీ వైరస్ వ్యాప్తి నుండి బయటపడేందుకు, కొందరు హైస్కూల్ విద్యార్థులు చేసే పోరాటంతో నడుస్తుంది. ఇది 12 ఎపిసోడ్‌లతో మొదటి సీజన్‌ను కలిగి ఉంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 1 గంట నిడివితో ఉంటుంది. ఈ సిరీస్ విడుదలైన తొలి 30 రోజుల్లో 474.26 మిలియన్ గంటల వీక్షణ సమయాన్ని సాధించింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌ లో

ఈ కొరియన్ జోంబీ అపోకలిప్స్ హారర్ సిరీస్ పేరు ‘ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్’ (All of us or dead). జూ డాంగ్-గ్యూన్ రాసిన “నౌ ఎట్ అవర్ స్కూల్” అనే వెబ్‌టూన్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‌లో పార్క్ జి-హూ, యూన్ చాన్-యంగ్, చో యి-హ్యూన్, లోమోన్, యూ ఇన్-సూ, లీ యూ-మీ, కిమ్ బ్యుంగ్-చుల్, లీ క్యూ-హ్యూంగ్, జియోన్ బే-సూ నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ Netflix లో 2022 జనవరి 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. IMDb లో దీనికి 7.5/10 రేటింగ్ ఉంది. ఈ కొరియన్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ డబ్బింగ్‌లతో అందుబాటులో ఉంది. అయితే రెండవ సీజన్ 2025లో విడుదల కావాల్సి ఉండగా, ఇది 2026కి వాయిదా వేయబడింది.


స్టోరీలోకి వెళితే

సిరీస్ హ్యోసాన్ హైస్కూల్‌లో జోంబీ వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రారంభమవుతుంది. ఇది ఒక విద్యార్థి మరొకరిని కొరకడంతో వేగంగా వ్యాపిస్తుంది. ఓన్-జో, చియోంగ్-సాన్, నమ్-రా, సూ-హ్యోక్ ఇతర విద్యార్థులు కలిసి స్కూల్‌లోని వివిధ ప్రాంతాలలో (క్లాస్‌రూమ్‌లు, క్యాంటీన్, లైబ్రరీ) జోంబీల నుండి తప్పించుకోవడానికి పోరాడుతారు. వీళ్ళు జోంబీల నుంచి తప్పించుకోవడానికి తెలివిగా ముందుకు కదులుతుంటారు. ఉదాహరణకు, ఫైర్ హోస్‌లతో బారికేడ్‌లు నిర్మించడం, డ్రోన్‌ను ఉపయోగించి సహాయం కోసం సందేశాలు పంపడం వంటివి చేస్తుంటారు. ఈ సమయంలో, హ్యోసాన్ నగరంలో మార్షల్ లా విధించబడుతుంది. సైన్యం స్కూల్‌ పై బాంబు దాడి చేస్తుంది. ఇది జోంబీలతో పాటు చాలా మంది మనుషులను  కూడా నాశనం చేస్తుంది.

మరోవైపు డిటెక్టివ్ సాంగ్ జే-ఇక్, పారామెడిక్ పార్క్ యంగ్-హ్వాన్ వైరస్ గురించి సమాచారాన్ని సేకరించి, దాని పై పరిశోధనలు చేస్తారు. నమ్-రా, ఒక హాంబీగా తన సమూహాన్ని రక్షించడానికి, జోంబీలను ఎదుర్కోవడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. సీజన్ ముగింపులో కొద్దిమంది విద్యార్థులు క్వారంటైన్ క్యాంప్‌కు చేరుకుంటారు. కానీ నమ్-రా తన సమూహంతో క్వారంటైన్ క్యాంప్‌కు చేరడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అక్కడ ఒక భయంకరమైన వాతావరణం ఉంటుంది. నమ్-రా తన మనుషులతో క్వారంటైన్ క్యాంప్‌కు చేరుకుంటుందా ? ఈ వైరస్ కి విరుగుడు దొరుకుతుందా ? అది ఎలా వ్యాపించింది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also : బ్రతికుండాగానే ఆర్గాన్స్ కోసేసే సైకో… క్రేజీ క్లైమాక్స్… మతిపోగోట్టే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×