E-Paper
Advertisement

Nidhhi Agerwal: ‘రాజా సాబ్’ కూడా పాయె.. ఇప్పుడు నిధి పరిస్థితేంటి?

Nidhhi Agerwal: ‘రాజా సాబ్’ కూడా పాయె.. ఇప్పుడు నిధి పరిస్థితేంటి?
Advertisement

Nidhhi Agerwal: గ్లామర్ ఇండస్ట్రీలో అందం, అభినయం ఉంటే సరిపోదు.. అంతకు మించి అదృష్టం కూడా ఉండాలి. ఈ మాట టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal)ని చూసిన ఎవరైనా అనేస్తారు. ఎందుకంటే, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో ఉన్నా, ఆ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో ఈ ముద్దుగుమ్మ తడబడుతోంది. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు వరుసగా నిరాశ పరచడంతో ఇప్పుడు నిధి కెరీర్ డైలమాలో పడింది. నిధి అగర్వాల్ కెరీర్ ఒక దశలో టాప్ గేర్‌కు వెళ్తుందని అంతా భావించారు. దానికి కారణం ఆమె చేతిలో ఉన్న స్టార్ హీరోల సినిమాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సరసన ‘హరి హర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజా సాబ్’ చిత్రాల్లో నిధి అగర్వాల్ నటించింది. ఈ రెండు ప్రాజెక్టులపై నిధి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలతో తను స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి వెళ్లడం ఖాయమని భావించింది. కానీ, కాలం ఆమెకు కలిసి రాలేదు.

Also Read- Sreeleela: పవన్ పైనే ఆశలు.. అప్పుడు శృతి హాసన్.. ఇప్పుడు శ్రీలీల!

అందం ఉంది.. అదృష్టమే లేదు!

Advertisement

ముఖ్యంగా ‘ది రాజా సాబ్’ సినిమాపై నిధి చాలా నమ్మకంగా ఉంది. ప్రమోషన్ల సమయంలో కూడా ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాలు బోల్తా కొట్టడం ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. ప్రభాస్ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో నిధి ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. గ్లామర్ షో విషయంలో నిధి అగర్వాల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటో షూట్లు కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంటాయి. అయితే, కేవలం గ్లామర్ మాత్రమే స్టార్‌డమ్‌ను ఇవ్వదని తాజా ఫలితాలు నిరూపించాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాల రిజల్ట్ తర్వాత ఇప్పుడు నిధికి కొత్త అవకాశాలు రావడం గగనంగా మారింది. ఈ సినిమాల ప్రమోషన్స్ టైమ్‌లో.. చేతిలో రెండు మూడు కొత్త సినిమాలు ఉన్నాయని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కటి కూడా అధికారికంగా ప్రకటించలేదు. గత సినిమాల పరాజయాల ప్రభావం కొత్త ప్రాజెక్టులపై పడిందని, అందుకే మేకర్స్ వెనకడుగు వేస్తున్నారనే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

Also Read- Tollywood Events: గెస్ట్‌లు రావడం లేదని ఏడ్వడం కాదు.. ముందు ఇలాంటివి చూసుకోండి?

సానుభూతి చూపిస్తున్న ఫ్యాన్స్

Advertisement

నిధి అగర్వాల్ పరిస్థితి చూసి ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ‘పాపం నిధి.. అంత అందం ఉన్నా, లక్ అస్సలు కలిసి రావడం లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐరన్ లెగ్ అనే ముద్ర పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఆమెకు కచ్చితంగా ఒక సాలిడ్ హిట్ కావాలి. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం మళ్ళీ రీ-ఎంట్రీ ఇచ్చే రేంజ్ కథల మీద ఉన్నట్లు తెలుస్తోంది. నిధి చేసింది తక్కువ సినిమాలే అయినా, గ్లామర్ పరంగా మంచి గుర్తింపునే పొందింది. కానీ, తాజా పరిస్థితులు చూస్తే తన ఉనికిని చాటుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ‘ది రాజా సాబ్’ రిజల్ట్ తర్వాత ఆమె ఎలాంటి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తుందో అనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్‌లో రాణించాలంటే కేవలం గ్లామర్ సరిపోదు, సరైన టైమ్‌లో సరైన హిట్ పడాలి. మరి నిధి అగర్వాల్ తన తర్వాతి ప్రాజెక్టుతోనైనా ఈ ‘బ్యాడ్ లక్’ను బ్రేక్ చేసి ఫామ్‌లోకి వస్తుందో లేదో వేచి చూడాలి!

Also Read- Simran Chodhary: ఒంపు సొంపులతో గిలిగింతలు పెడుతున్న సిమ్రాన్ చౌదరి!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×