E-Paper
Advertisement

ఏపీకి గట్టి షాకిచ్చిన తెలంగాణ.. కృష్ణా నీళ్ల పంపకాలపై షాకింగ్ ట్విస్ట్!

ఏపీకి గట్టి షాకిచ్చిన తెలంగాణ.. కృష్ణా నీళ్ల పంపకాలపై షాకింగ్ ట్విస్ట్!
Advertisement

Krishna Water: కృష్ణా బేసిన్​లోనూ రెండు రాష్ట్రాల అవసరాలకు సరిపడా నీళ్లు వస్తాయని, అయినా ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా వాడేసుకుంటున్నదని, వరికి అవసరమయ్యే నీటికన్నా ఎక్కువగా వినియోగిస్తూ తిరిగి నీళ్లను అడుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​ -2 (కేడబ్ల్యూడీటీ 2, బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​) ఎదుట శుక్రవారం తెలంగాణ అడ్వొకేట్​ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ విదనలకు కౌంటర్లు, వివరణలు ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి కేటాయింపులు తాత్కాలికమేనని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్​ అరెంజ్​మెంట్​ మాత్రమేనని, 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు పంచుకుంటున్న నీళ్ల వాటా శాశ్వతం కాదని వాదనలు వినిపించారు.

ఆర్టికల్​ 262 ప్రకారం..

విభజనచట్టంలోని 84, 85(8), 87 సెక్షన్ల ప్రకారం నీటి వాటాల పంపకాలపై బోర్డులకు అధికారం లేదనిఅన్నారు. విభజనచట్టం, జల వివాదాల చట్టాన్ని ఏపీ తప్పుగా చెప్తున్నదని, ఆర్టికల్​ 262 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్​ నీటిని కేటాయించాలని, జల కేటాయింపులను చేయడంలో పార్లమెంట్​కుగానీ, కేంద్రానికిగానీ అధికారం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే కేడబ్ల్యూడీటీ 2కి ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను కేంద్రం సిఫార్సు చేసిందని, విభజనచట్టంలోని 85(8) సెక్షన్​ తాత్కాలికం కాదని వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు సెప్టెంబర్​ 16 నుంచి 18 వరకు కొనసాగనున్నాయి.

Advertisement

Also Read: ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

అవి తప్పు వాదనలు

ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ 2 కేటాయింపులను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం లేదని ఏపీ వాదించడం తప్పు అన్నారు. రెండు రాష్ట్రాలకు ఆవిరి నష్టాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు పోనూ వ్యవసాయానికి 780 టీఎంసీల నీళ్లు ఉంటాయని, అందులో వరికి400 టీఎంసీలు వాడుకోవచ్చన్నారు. కృష్ణాలోని నీటిని తలసరి వినియోగం కింద లెక్కగట్టి చెప్తున్న ఏపీ.. కృష్ణాలో కలుస్తున్న గోదావరి నీళ్లు, పెన్నా నీళ్లను మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, అది శుద్ధ తప్పు వాదనలు వినిపించారు.

ఉమ్మడి ఏపీకి..

Advertisement

కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు తేల్చలేదంటూ ట్రిబ్యునల్​ ఇంటరిమ్​ ఆర్డర్​ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలను తేల్చాల్సిన అవసరం ఉంటుందని వైద్యనాథన్ అన్నారు. పూర్తి కేటాయింపులను ట్రిబ్యునల్​ మార్చినప్పటికీ ఆకేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలు ఇచ్చే అధికారం ఉంటుందని వాదనలు వినిపించారు.

Also Read: నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×