Rice Millers: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లింగ్ బకాయిలను నొక్కేసేందుకు రైస్ మిల్లర్లు సరికొత్త ‘డ్రామా’కు తెరలేపారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుంటూ, రకరకాల కుంటిసాకులు చెబుతూ సమయం దాటవేసే యత్నాలు షురూ చేశాయి. ప్రభుత్వానికే ఎసరు పెట్టేలా ఎదురుదాడికి దిగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సైతం అదేస్థాయిలో ఆగ్రహంతో ఉంది.బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది.
సాధారణంగా ప్రభుత్వం సేకరించి ఇచ్చే ప్రతి 100 కిలోల (క్వింటా) ధాన్యానికి మిల్లర్లు 67 కిలోల బియ్యాన్ని (కస్టం మిల్లింగ్ రైస్- సీఎంఆర్) పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలి. ఇది నిబంధన కూడా. ఇది ఎన్నో ఏళ్లుగా అమలులో ఉన్న నిబంధనే. కానీ ఇప్పుడు హఠాత్తుగా తెలంగాణ రారైస్ మిల్లర్లు, మిల్లర్లు కొత్త పల్లవి అందుకున్నారు.తమకు క్వింటా ధాన్యానికి 62 శాతం కూడా రావడం లేదు వింత వాదనలు మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభుత్వం అగ్రిమెంట్ ను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట..అధికారంలోఒకలా పాలన చేస్తున్నారని సీఎంపై కౌంటర్ మొదలు పెట్టారు. మిల్లింగ్ వ్యవస్థ దెబ్బ తింటే రైతులు ప్రజల తీవ్ర ఇబ్బంది పడుతారని కొత్తవాదనను తెరమీదకు తెచ్చారు. అంతటితో ఆగకుండా సీఎం తీరును ఖండిస్తున్నట్లు రారైస్ మిల్లర్లు అసోసియేషన్ నేతలు పేర్కొనడం చర్చకు దారితీస్తుంది. రైసు మిల్లు సంఘాల పై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును ఖండిస్తున్నాం.. మహిళా సంఘాలకు ఇస్తామని సీఎం రైస్ మిల్లర్ల ను భయపెట్టిస్తున్నారని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు సందించారు. అంటే వీరు ప్రభుత్వానికి ఇచ్చే సీఎంఆర్ ను తప్పించుకునే ప్లాన్ లో భాగమేనా అనేది ఇప్పుడు హాట్ టాఫిక్ అయింది.
Also Read: అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు! కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!
మిల్లులో 50లక్షల పెట్టుబి పెట్టి కలర్ సాటిక్స్ వేసి రెండుసార్లు బియ్యాన్ని సార్ టెక్స్ చేస్తున్నామని, దీంతో 10శాతం నష్టం జరుగుతుందని మిల్లర్స్ ఇప్పుడు రాగం అందుకున్నారు. దీనికి తోడుపెట్రోల్ ధరలు పెరగడం, హమాలి, కరెంటు చార్జీలు, మిల్లు డ్రైవర్లు, గుమస్తాలు అందరి జీతాలు పెరగడం మిల్లర్లకు భారంగా మారిందని, మిల్లింగ్ చార్జీలు పెంచాలని కోరుతున్నారు. తడి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంటే ఈ ‘సాటెక్స్’ నష్టాల పేరు చెప్పి పాత బకాయిలు, రికవరీలను ఎగ్గొట్టేందుకే ఈ కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రైతు వ్యవసాయానికి సహకరిస్తున్నామని మిల్లర్స్ పేర్కొంటుండటం.. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు.. ఇది సీఎం ఇచ్చిన వార్నింగ్ కారణమనే ప్రచారం జరుగుతుంది.
ఇన్నాళ్లూ తమ ప్రభావంతో ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేయవచ్చనుకున్న మిల్లర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు.”మిల్లర్లు దారికి రాకపోతే, బియ్యం అప్పగించడంలో ఆలస్యం చేస్తే.. మిల్లింగ్ బాధ్యతలను పూర్తిస్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం అని హెచ్చరించారు.అంటూ సీఎం ఇచ్చిన తీవ్ర హెచ్చరికతో మిల్లర్లలో గుబులు మొదలైంది. ఏళ్ల తరబడి సాగుతున్న తమ గుత్తాధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని, ధాన్యం వ్యాపారం తమ చేయి దాటిపోతుందేమోనని మిల్లర్ల వర్గాలు హడలిపోతున్నాయి. ఎదురుదాడి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే రా రైస్ మిల్లర్లు అసోసియేషన్ నేతలు ప్రభుత్వం, సీఎంపై ఆరోపణలు మొదలు పెట్టినట్లు స్పష్టమవుతోంది.
మిల్లర్లు బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని వసూలు చేయాల్సిందేనని సీఎం ఆదేశించడంతో పౌరసరఫరాలశాఖ అధికారులు ఒత్తిడి స్టార్ట్ చేశారు. దీంతో మిల్లర్లు అధికారులపై తమదైన శైలీలో ఆరోఫలు మొదలు పెట్టారు. పౌరసరఫరాల శాఖలోని కొందరు జిల్లా సరఫరా అధికారులు తమ వద్ద భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని, రైస్ మిల్లర్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ మిల్లర్ల సంఘాల నాయకులు ప్రకటనలు గుప్పించడం కలకలం రేపుతోంది. లంచాలపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.
Also Read: గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
లంచాలు తీసుకునే వ్యవస్థ ను ప్రక్షాళన చేయాలని.. నిఘా సంస్థలతో విచారణ చేయించాలి. సీఎంఆర్ అగ్రిమెంట్ ను వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేయడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. లంచాలు ఇస్తేనే పనులు చేస్తున్నారని లేకుంటూ సాకులు వెతుక్కుతున్నారని,మిల్లర్ల ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ నాయకులు నిలదీస్తున్నారు. చెల్లించాల్సిన వేల కోట్ల విలువైన బియ్యాన్ని అప్పగించకుండా తప్పించుకోవడానికే మిల్లర్లు ఇలాంటి నిందలు వేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
ప్రభుత్వ సొమ్మును, ప్రజల పన్నుల పైసాను వదలకుండా రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.బకాయిల వసూలుకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. విధివిధానాల రూపకల్పన పూర్తయిన తర్వాత ఆ నివేదికను మంత్రివర్గ ఉప సంఘానికి సమర్పించనున్నారు. మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. అయితేడిఫాల్ట్ అయిన మిల్లులకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద నోటీసులు, ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ముమ్మరం చేయడం,మిల్లుల్లో నిల్వలపై సడన్ రైడ్స్, ఫిజికల్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. మరోవైపు మిల్లింగ్ వ్యవస్థలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధమవుతోంది.
ప్రభుత్వం ఓవైపు బకాయిల వసూళ్లకు ముమ్మర కసరత్తు చేస్తూ ఉక్కుపాదం మోపుతుంది. మరింత స్పీడ్ పెంచబోతుంది. మరోవైపు మిల్లర్లు కుంటిసాకులతో తప్పించుకునేందుకు లంచాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతోందనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ధాన్యం కేటాయించిన 15 రోజుల్లోనే సీఎంఆర్ ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకోవడంతో పాటు ఇవ్వని మిల్లులపై ఉక్కుపాదం మోపితే తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఇబ్బందులు కలుగవు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?