iPhone 18 Duo vs New Car: స్మార్ట్ ఫోన్ కొనాలా? లేక కారు కొనాలా? సాధారణంగా ఈ రెండింటినీ పోల్చుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ, ఒక ఫోన్ ధర కొన్ని కార్ల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఈ ప్రశ్న ఆసక్తికరంగా మారుతుంది. తాజాగా విడుదలైన ఐఫోన్ 18 సిరీస్‌లో అత్యంత ఖరీదైన ఐఫోన్ 18 డ్యూయో ధర సుమారు రూ.4.5 లక్షల వరకు ఉండటంతో ఇప్పుడు ఇదే చర్చకు కారణమవుతోంది. ఆపిల్ కొత్త ఐఫోన్ లో ఫోల్డబుల్ డిస్ ప్లే, పెద్ద బ్యాటరీ, అధునాతన కెమెరాలు, 2TB వరకు స్టోరేజ్ లాంటి ఫీచర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ ఫోన్ కోసం ఖర్చు చేసే మొత్తంతో భారత మార్కెట్లో కొన్ని కొత్త కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునేవారికి మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ధర రూ.3.50 లక్షలుగా ఉంది. VXI (O) పెట్రోల్ MT వేరియంట్ ధర కూడా రూ.4.32 లక్షలగా ఉంది. చిన్న సైజు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సిటీ డ్రైవింగ్ కు అనువుగా ఉండే డిజైన్ ఈ కారు ప్రత్యేకతలు. తక్కువ బడ్జెట్ లో రోజువారీ అవసరాలకు కారు కావాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.
మారుతి ఆల్టో K10 ధర రూ.3.70 లక్షల నుంచి మొదలవుతుంది. LXI (O), టూర్ H1 వేరియంట్ల ధర రూ.4 లక్షల వరకు ఉంటుంది. చిన్న కారు అయినప్పటికీ నగరాల్లో సులభంగా నడపడం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లాంటి అంశాలు దీనికి ప్లస్ పాయింట్లు. మొదటిసారి కారు కొనేవారిలోనూ ఈ మోడల్‌కు మంచి ఆదరణ ఉంది.
ఐఫోన్ ధరకు దగ్గరగా ఉండే మరో బడ్జెట్ కారు రెనాల్ట్ క్విడ్. దీని ఎవల్యూషన్ MT వేరియంట్ ధర రూ.4.53 లక్షలు కాగా, AMT వెర్షన్ రూ.4.90 లక్షలుగా ఉంది. ఎత్తైన స్టాన్స్, SUV తరహా లుక్, కాంపాక్ట్ డిజైన్ కారణంగా బడ్జెట్ కార్లలో క్విడ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
కొంచెం పెద్ద కారు కావాలనుకునేవారికి టాటా టియాగో మరో ఆప్షన్. దీని స్మార్ట్ పెట్రోల్ MT వేరియంట్ ధర రూ.4.77 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యాచ్ బ్యాక్ అయినప్పటికీ మంచి స్థలం, బలమైన నిర్మాణం, పలు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు టియాగో అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఐఫోన్ 18 డ్యూయో ధర కంటే తక్కువ మొత్తానికే ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
ఈ లిస్టులో చివరిగా మారుతి వాగన్ ఆర్ ఉంది. దీని LXI పెట్రోల్ MT వేరియంట్ ధర రూ.4.99 లక్షలు. విశాలమైన క్యాబిన్, సులభమైన డ్రైవింగ్, ప్రాక్టికల్ డిజైన్ కారణంగా వాగన్ ఆర్ చాలాకాలంగా భారత మార్కెట్లో ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది.
Read Also: టెస్లా సైబర్ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!