Rajamouli -Dragon Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటేనే సినిమాపై భారీగా అంచనాలు ఉంటాయి. ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న సినిమాలే. ఇక రాజమౌళి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్(Don’t Trouble The Trouble). ఫహద్ పజిల్(Fahad Fassil) హీరోగా శశాంక్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ యమదొంగ స్టైల్ లో వేదిక పైకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ తో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా(Dragon Movie) నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా హాజరయ్యారు. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక వేదికపై దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మీరందరూ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ఏ విధంగా అయితే ఎదురుచూస్తున్నారో తాను కూడా అదేవిధంగా డ్రాగన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు..
ఇక ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యి అనుకున్న సమయానికి విడుదల కాదేమోనని భావించాను కానీ, ఈ సినిమా ముందుగా అనుకున్న విధంగానే జూన్ 11వ తేదీ మీ ముందుకు రాబోతోంది అంటూ రాజమౌళి ఈ సందర్భంగా డ్రాగన్ సినిమా విడుదల గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా డ్రాగన్ సినిమా అనుకున్న విధంగానే విడుదల అవుతుందని ఎలాంటి వాయిదాలు ఉండవని తెలియజేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే ఈయన చేతికి సర్జరీ కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇక సర్జరీ తర్వాత మొదటిసారి ఎన్టీఆర్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇక్కడ ఈయనని చూస్తుంటే చేతికి గాయం ఇంకా పూర్తిగా నయం అవ్వలేదని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా అనుకున్న విధంగానే డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయంపై స్పష్టత రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి వారణాసికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు కానీ రాజమౌళి మాత్రం వారణాసికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మహేష్ బాబు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
Also Read: AI కంపెనీకి షాక్ ఇచ్చిన ఊర్వశి రౌతేలా.. రూ. 7 వేల కోట్ల దావా!