E-Paper
Advertisement

O Andala Rakshasi: అమ్మాయిల జోలికి వస్తే.. ఈ సుందర రాక్షసి అక్కడ కుమ్మేస్తుందట!

O Andala Rakshasi: అమ్మాయిల జోలికి వస్తే.. ఈ సుందర రాక్షసి అక్కడ కుమ్మేస్తుందట!

O Andala Rakshasi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న వెర్సటైల్ టాలెంట్ షెరాజ్ మెహదీ (Sheraz Mehdi). నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా.. ఇలా ‘వన్ మ్యాన్ షో’తో ప్రేక్షకులను మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ‘కెఎస్ 100, ఆమ్లెట్, ఇంకా ఏమీ అనుకోలేదు, పార్సిల్’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన షెరాజ్ మెహదీ, తాజాగా ‘ఓ అందాల రాక్షసి’ (O Andala Rakshasi) చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తెలుగులో విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు సరిహద్దులు దాటి కన్నడ నాట కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ (O Sundara Rakshasi) అనే టైటిల్‌తో విడుదలైన ఈ మూవీకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లుగా చెబుతూ మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read- Sree vishnu: విష్ణు విన్యాసం, మృత్యుంజయ విడుదలపై శ్రీ విష్ణు క్లారిటీ.. బయటపడ్డానంటూ!

సామాజిక అంశమే సక్సెస్ మంత్రం

ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారణం దాని కథాంశం. సమాజంలో నేటికీ అబలలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, అత్యాచారాల వంటి సున్నితమైన అంశాలను షెరాజ్ మెహదీ ఎంతో ధైర్యంగా వెండితెరపై ఆవిష్కరించారు. అమ్మాయిల జోలికి వస్తే ఎదురయ్యే భయంకరమైన పరిణామాలు ఏమిటి? కామాంధులకు చట్టం, సమాజం ఎలాంటి గుణపాఠం చెప్పాలి? అనే అంశాలను కమర్షియల్ హంగులు అద్దుతూనే, ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా, హీరోగా కూడా నటించడం విశేషం. ఓ వైపు ఎమోషన్స్ పండిస్తూనే, మరోవైపు సమాజంలోని అన్యాయంపై తిరగబడే యువకుడిగా ఆయన ఇందులో నటించారు.

Also Read- Veerappan The Bandit King OTT : సిరీస్‌ గా రాబోతున్న మోస్ట్ డేంజరస్ అడవి దొంగ వీరప్పన్ జీవిత చరిత్ర… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడచ్చు అంటే ?

భాషతో సంబంధం లేదు

విహాన్షి హెగ్డే, కృతి వర్మ హీరోయిన్లుగా ఇందులో నటించారు. ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి సినిమాకు గ్లామర్‌తో పాటు పర్‌ఫార్మెన్స్‌ను కూడా అందించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ పై నిర్మాత సురీందర్ కౌర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు కన్నడలో వస్తున్న రెస్పాన్స్‌పై షెరాజ్ మెహదీ స్పందిస్తూ.. ‘‘తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమాను కన్నడలో విడుదల చేశాం. అక్కడ ‘ఓ సుందర రాక్షసి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో కూడిన కథలను ఎంచుకుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనేదానికి ఈ సినిమా సక్సెస్ ఒక ఉదాహరణ అని ఈ సినిమాను చూసిన వారంతా చెబుతుండటం విశేషం.

Also Read- Siddhu Jonalgadda: సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా కథ ఇదే.. టైటిల్ కూడా కాస్త కొత్తగా..!

Related News

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

Big Stories

×