E-Paper
Advertisement

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!
Advertisement

Emraan Hashmi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమాలో విలన్ గా అద్భుతమైన నటనను కనబరిచిన ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో ఆయన తెలుగు ఆడియన్స్ హృదయాలకు చేరువయ్యారు. ఓజీ విలన్ గా తెలుగు ప్రేక్షకుల చేత ప్రత్యేకమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈయనకు తృటిలో ప్రమాదం తప్పిందని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి అసలేం జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు.

ఓజీ విలన్ కి తృటిలో తప్పిన ప్రమాదం..

అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ హీరోగా, సీరియల్ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన ‘గన్ మాస్టర్ G9 ‘అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్ కి వేలాడదీసిన ఎస్ యు వి కార్ గాల్లో పల్టీలు కొడుతూ కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్ పై పడింది .ఈ కారు ఇమ్రాన్ హష్మీకి అత్యంత సమీపంలో రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటనపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

Advertisement

also read:కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

వైరల్ అవుతున్న వీడియో..

ఇకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా చిత్ర బృందం స్టంట్ కి సిద్ధమైంది. కౌంట్ డౌన్ మొదలవ్వగానే క్రేన్ కు వేలాడదీసిన ఎస్ యు వి గాల్లో తిరుగుతూ తలకిందులుగా మారి కింద ఉన్న వ్యాన్ పైకప్పు పై బలంగా పడింది. ఈ వ్యాన్ కి అతి సమీపంలోనే హీరో ఇమ్రాన్ హష్మీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర బృందం వెంటనే అప్రమత్తమైనట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రావాలి అంటే చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సిందే.

గన్ మాస్టర్ G9 మూవీ విశేషాలు..

Advertisement

ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది . ఇందులో ఇమ్రాన్ హష్మీతో పాటు అపారశక్తి ఖురానా, అభిషేక్ సింగ్, జెనీలియా దేశ్ముఖ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ , రొమాంటిక్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్టులోనే విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ లో హీరో పాత్రను మాత్రమే రివీల్ చేశారు. ఇందులో ఆయన ఈశ్వర్ అనే డైరీ ఫామ్ యజమానిగా కనిపించనున్నారు . ఇక తాను ప్రేమించే మహిళను రక్షించేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడే వ్యక్తిగా ఈ పాత్రను తీర్చిదిద్దినట్లు మనకు గ్లింప్స్ ద్వారా చూపించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

అలీకి అబ్దుల్ కలాం అవార్డు..ఆయన చేతుల మీదుగా స్వీకరణ!

400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో మీరు గుర్తుపట్టారా?

పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న బాలయ్య కూతురు.. అక్కడి నుంచే పోటీ!

విజయ్‌ను ట్రోల్ చేసేవాళ్లు ఇది వినాల్సిందే.. హరీష్ శంకర్ స్ట్రాంగ్ ఆన్సర్!

Big Stories

Advertisement
×