E-Paper
Advertisement

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!
Advertisement

Local Train Garba Video: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై లోకల్ ట్రైన్‌లో కొందరు మహిళలు ఉత్సాహంగా గర్భా నృత్యం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రైలులోనే గర్భా సంబరాలు

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు మహిళలు ఎరుపు రంగు చీరలు, ఇతర సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించారు. గుజరాతీ భక్తి గీతం ‘పావ్‌గఢ్ వాలీ మానే దర్శన్ దే’ పాటకు అనుగుణంగా వారు రైలులో గుండ్రంగా తిరుగుతూ గర్భా స్టెప్స్ వేయడం అందరినీ ఆకట్టుకుంది. నవరాత్రి మూడో రోజుకు ‘ఎరుపు’ రంగు ప్రత్యేకత కావడంతో చాలా మంది మహిళలు అదే రంగు దుస్తుల్లో మెరవడం విశేషం.

సోషల్ మీడియాలో వైరల్

Advertisement

వేలాది మంది నిత్యం ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్‌లో ఈ సాంప్రదాయ నృత్యం చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. వీడియో ఎప్పుడు రికార్డ్ అయిందనే దానిపై కూడా ఎక్కడా క్లారిటీ రాలేదు. అయితే పండుగ సీజన్ కావడంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Advertisement

Also Read: BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు

తొమ్మిది రాత్రుల పాటు అంగరంగ వైభవంగా జరిగే నవరాత్రి వేడుకలు దుర్గాదేవి వివిధ రూపాల ఆరాధనకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ పండుగలో గర్భా, దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆయా నృత్యాలు చేస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సదరు ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేకపోయినా.. ఈ వీడియో మాత్రం నవరాత్రుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.

Also Read: భారతీయ పైలట్‌పై దాడి.. విచారణ ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. యూఏఈకి ప్రత్యేక బృందం!

Tags

Related News

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

Big Stories

Advertisement
×