Bigg Boss 10 Rohit: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కార్యక్రమంలో భాగంగా కామనర్స్ కూడా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరీలో భాగంగా హౌస్ లోకి అడుగుపెట్టిన వారిలో రోహిత్ నాయుడు(Rohit Naidu), శాలిని(Shalini) కూడా ఉన్నారు. అయితే రోహిత్ మొదటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి పట్ల సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇటీవల రోహిత్ శాలిని లవ్ ట్రాక్ కూడా విమర్శలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri)ఇంస్టాగ్రామ్ వేదికగా రోహిత్ శాలిని వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమన్నా సింహాద్రి ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.. తాను బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడకూడదని చాలాసార్లు అనుకుంటాను కానీ మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. బిగ్ బాస్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ షో కానీ ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లిన రోహిత్ లాంటి కన్నింగ్ మైండ్ ఉన్న కంటెస్టెంట్, శాలిని లాంటి నీచమైన కంటెస్టెంట్ ను ఇప్పటివరకు 10 సీజన్లలో ఎవరు లేరని తెలిపారు. అసలు వాళ్ల కన్న తల్లిదండ్రులు వాళ్లకు ఏం నేర్పించారు.. టాస్కులు ఆడేటప్పుడు రోహిత్ ఫిజికల్ అటాక్ చేస్తున్నారని తమన్నా సింహాద్రి మండిపడ్డారు.
రోహిత్ ఆడే టాస్కులు అన్నీ కూడా చాలా ఫేక్ అని.. టాస్క్ ఆడే టైంలో పక్క వాళ్ళపై ఫిజికల్ అటాక్ చేస్తూ వారికి గాయాలు అవుతున్న పట్టించుకోరని, అంత కండింగ్ మైండ్ ఉన్న పెద్ద ముం*డు రోహిత్ అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శాలిని లాంటి ముం* కూడా ఇప్పటివరకు తాను ఎక్కడ చూడలేదని తెలిపారు. ఇక వీరిద్దరూ ఏదో కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కోసం ఏదో హోటల్ కి వెళ్తే ఎలా ఉంటారో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అలా ఉంటున్నారని తమన్నా సింహాద్రి మండిపడ్డారు. ఇలాంటి వారికి ఓట్లు వేస్తున్న వారికి సిగ్గులేదు అంటూ ఫైర్ అయ్యారు.
?rpxt=MXJnNnk5azgwc2ZpYQ%3D%3D
ఇక రోహిత్ పెద్ద ఎత్తున పిఆర్ లను పెట్టుకొని అన్ని దొంగ ఓట్లు వేయించుకుంటున్నారని దొంగ వీడియోలు పెట్టుకుంటున్నారని తమన్నా సింహాద్రి తెలిపారు. అలాంటి ఒక కన్నింగ్ ఫెలోకి పని చేయడానికి పీఆర్లకు కూడా సిగ్గు లేదా? అంటూ ఈమె రోహిత్ వ్యవహరి శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ప్రేక్షకుల ఓటింగ్ పరంగా నడవలేదని కేవలం పిఆర్ ఓటింగ్ పరంగా నడుస్తోంది అంటూ తమన్నా తెలిపారు. ఇలాంటి ఒక కన్నింగ్ మైండ్ ఉన్న కంటెస్టెంట్ ను ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు పెట్టారో ఆ నిర్వాహకులనే అడగాలి అంటూ తమన్న ఈ సందర్భంగా రోహిత్ షాలిని పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక తమన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కొందరు మద్దతుగా కామెంట్లు చేయగా మరి కొందరు రోహిత్ విన్నర్ అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: నన్ను గెలికితే ఎవడినీ వదలను…విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!