E-Paper
Advertisement

కామెడీతో ఆకట్టుకుంటున్న పళ్ళబురుసు టీజర్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

కామెడీతో ఆకట్టుకుంటున్న పళ్ళబురుసు టీజర్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!
Advertisement

Pallaburusu teaser: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వస్తున్న ఎన్నో సినిమాలు గ్రామీణ కథను ఆధారంగా చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల భాషా సంస్కృతి ఉట్టిపడేలా తెరకెక్కిస్తున్న ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వైవిధ్యమైన గ్రామీణ కథ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. మురళీధర్ గౌడ్ (Muralidhar gowd), సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), ప్రజ్వల్ (Prajwal), గోమతి (gomathi)తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య , వివేక్ కృష్ణాని నిర్మిస్తున్నారు
. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా.. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.ఇకపోతే ఈ విషయాన్ని తెలియజేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక వీడియోని పంచుకోగా.. ఇప్పుడు ఏకంగా టీజర్ ను విడుదల చేశారు.

నాగచైతన్య చేతుల మీదుగా పళ్ళ బురుసు టీజర్..

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) చేతుల మీదుగా పళ్ళ బురుసు టీజర్ రిలీజ్ అయింది. పళ్ళ బురుసు మూవీ నుండి విడుదలైన టీజర్ లో మురళీధర్ గౌడ్ నటన మరొకసారి పీక్స్ కి చేరిపోయింది. తన అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ తో, కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

also read:సర్జరీ తర్వాత తొలిసారి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

టీజర్ ఎలా ఉందంటే?

ఇందులో కేతిరి సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రి కొడుకులుగా నటించారు. ప్రజ్వల్ , గోమతి మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు సుధాకర్ రెడ్డి – మురళీధర్ గౌడ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు టీజర్ కి హైలెట్గా నిలిచాయి. ముఖ్యంగా డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా ఆడియన్స్ను ఆకట్టుకుంటూనే థియేటర్లలో విజిల్స్ మోత మోగడం ఖాయం నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. సహజత్వం ఉట్టిపడేలా సింపుల్ సెట్, గ్రామీణ వాతావరణాన్ని సృష్టిస్తూ తెరకెక్కించిన తీరు మనసును బాగా హత్తుకుంటుంది. మొత్తానికి అయితే గ్రామీణ కథ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది.

Advertisement

 

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×