Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈయన రాజకీయాల్లో బిజీగా అయిపోయాడు కానీ సినిమాల్లో ఉండి ఉంటే ఈరోజు ఇంకోలా ఉండేది. దీని కారణం ఈయన సినిమా రిలీజ్ కి సరిగ్గా 10 రోజులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అంత హడావిడి లేకుండా అయిపోయింది. అదే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే నెలరోజులు ముందు నుంచే బీభత్సమైన హడావిడి ఉండేది.
పవన్ కళ్యాణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టారు. అందుకే పదేళ్లపాటు హిట్ లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ క్రేజ్ రెండూ పెరిగాయి. దీనికి కొంతవరకు ఆయన వ్యక్తిత్వం కూడా తోడ్పడింది. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ నుంచి సరైన సినిమా రావట్లేదు అనుకునే టైంలో గబ్బర్ సింగ్ సినిమాతో బీభత్సమైన బ్లాక్ బస్టర్ అందించాడు హరీష్ శంకర్.
హరీష్ ను ఆదుకున్నారు
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ అనౌన్స్ చేసిన సినిమా ఇప్పటివరకు పూర్తిగా లేదు. దీనికి ప్రధమ కారణం పవన్. ఈ లోపు హరీష్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా ఫినిష్ చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం ఆగస్ట్ నెలాఖరు వరకూ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారు. వచ్చే నెలతో ఫాస్ట్ ఫేజ్ లో షూట్ కంప్లీట్ చేయనున్నారు. అభిమానులకు ఏం కావాలో… పవన్ కళ్యాణ్ నుంచి ఏం తీసుకోవాలో ఒక అభిమానిగా హరీష్ శంకర్ కు బాగా తెలుసు… ఈసారి కూడా బ్లాక్ బస్టర్ దిశగా కంటెంట్ ప్లాన్ చేసుకున్నారు. దేవి సాంగ్స్ తో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్ తో మళ్ళీ గబ్బర్ సింగ్ వైబ్ రావడం ఖాయం. బచ్చన్ తో ప్లాప్ లో ఉన్న హరీష్ కు మరోసారి అసలైన పని పడింది. ఇంక బాక్స్ ఆఫీస్ పని పట్టడమే ఉంది.
రికార్డ్స్ తిరగ రాశాడు
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ ని ఆ సినిమా తుడిచి పెట్టేసింది. ఒక సామాన్యమైన అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నాడో అలానే చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో సునామీ సృష్టించాడు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే డైలాగులు రాసాడు. అద్భుతమైన మేనరిజమ్స్ వెండితెరపై ఆవిష్కరించాడు. అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎంతమంది దర్శకులతో సినిమా చేసిన కూడా, హరీష్ శంకర్ తో సినిమా చేయడం అనేది ప్రత్యేకమని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. వాస్తవానికి అది కూడా నిజమే చెప్పాలి.
Also Read: Mega157 : రిస్క్ లో రావిపూడి, రెండు పడవల ప్రయాణం అవసరమా.?