E-Paper
Advertisement

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్
Advertisement

Pawan Kalyan:టాలీవుడ్ హీరోలంతా ఇపుడు సర్జరీలతో సావాసం చేస్తున్నారు..రామ్ చరణ్, వరుణ్ తేజ్,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్, రష్మిక,బాలయ్య ..ఇలా స్టార్ సెలెబ్రిటీలంతా గాయాలపాలై ఆస్పత్రుల బాట పట్టినవారే.ఇక సర్జరీలతో ఒక్కొకరు మెల్లిగా కోలుకుంటున్నారు.ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కుడి భుజానికి ‘రొటేటర్ కఫ్’ సర్జరీ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ .ఇక ఆపరేషన్ అయ్యాక కనీసం కొన్ని వారాల పాటు ఇంట్లోనే ఉండి పూర్తి విశ్రాంతి తీసుకోమ్మని చెప్పారు డాక్టర్లు .

వారం రోజులు కూడా గడవక ముందే

కానీ డాక్టర్ల మాటని పెడచెవిన పెట్టిన పవన్ కళ్యాణ్ వారం రోజులు కూడా గడవక ముందే అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చేశారు. రోజుకు పది పన్నెండు గంటల పాటు వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించడం, ముందస్తుగా ఖరారైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, మరోపక్క పార్టీ అంతర్గత సమావేశాలు నడపడంతో ఆయన విశ్రాంతిని పూర్తిగా పక్కన పెట్టేశారు.

Advertisement

ఫలితంగా ఆపరేషన్ జరిగిన కుడి భుజం భాగంలో వాపు బాగా పెరిగిపోవడంతో పాటు తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది. సరిగ్గా రెస్ట్ తీసుకోకపోతే గాయం మరింత తిరగబెట్టే ప్రమాదం ఉందని గ్రహించిన వైద్యులు, తక్షణమే విశ్రాంతి తీసుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో భుజం నొప్పి నుండి రిలీఫ్ పొంది, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కేరళలోని ప్రముఖ ఆయుర్వేద వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీ తీసుకోవడానికి రేపే కేరళకి వెళ్లేందుకు సిద్దమయ్యారని సమాచారం.

ప్రస్తుతం ఈ వార్త తెలిసిన ఆయన కోట్లాది మంది అభిమానులు, జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ‘గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు’ అంటూ పోస్టులు పెడుతుండటంతో ఇది నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.

ఈ గాయం ఇప్పటిది కాదు

Advertisement

నిజానికి పవన్ కళ్యాణ్ కి ఈ గాయం ఇప్పటిది కాదు.తమ్ముడు సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నప్పటి నుండే ఇది మొదలయింది.ఇక క్రమక్రమంగా ‘ఖుషి’ ‘జల్సా’ ‘అత్తారింటికి దారేది’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇలా వరుస సినిమాలలో ఫైట్స్ సీన్స్ చేస్తున్నప్పుడల్లా ఈ గాయం పెరుగుతూ వచ్చిందని తెలుస్తుంది.ఇక ఆతర్వాత అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ వరుస పెట్టి కాసింత గ్యాప్ లేకుండా బిజీ బిజీగా గడిపడంతోనే చివరికి ఇలా రొటేటర్ కఫ్ సర్జరీ దాక వచ్చిందని సమాచారం.

also read :మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!

ఈ కేరళ ట్రిప్ తర్వాత అయినా పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుందాం !

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×