Sama Ramamohan Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ పిల్లలే స్కూళ్లు, కాలేజీలు బాగాలేవని చెప్పారని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వంలో స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను తీసుకువస్తున్నామన్నారు. కానీ విద్యార్థులను పక్కదారి పట్టిస్తూ బీఆర్ ఎస్, బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు.. తమ పిల్లలు విదేశాల్లో బాగా చదువుకోవాలని తపన పడుతూ ఇక్కడ విద్యార్థుల జీవితాలను మాత్రం నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారని సామా మండిపడ్డారు. విద్యార్ధులను రెచ్చగొట్టి, పక్కదారి పట్టించే నీచమైన రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఉన్నత విద్యను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం విదేశీ పర్యటన చేస్తున్నారన్నారు. అమెరికా లో అందిస్తున్న విద్యను ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ కేంద్రం నిరాకరణతో సీఎం అమెరికా పర్యటన రద్దు అయిందన్నారు.
Also Read: ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, హిల్ట్ పాలసీని అడ్డుకున్న బీ ఆర్ ఎస్, బీజేపీలు.. ఇప్పుడు విద్యను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పాలిటెక్నీక్ విద్యార్థులకు ఇంజనీరింగ్ ప్రవేశం లేదంటూ తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను రెచ్చ గొట్టారన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం శక్తి స్కీమ్ ను తీసుకోచ్చిందన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులతో పాలిటెక్నిక్ అడ్మిషన్లు పెరుగుతున్నాయన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
Also Read: గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!