Hyderabad: దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ మహిళ.. గంజాయితో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది.. ఆమె బ్యాగులను తనిఖీ చేశారు. ఏకంగా రెండు బ్యాగులలో 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిసింది. భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.