HHVM Collections..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా.. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు (Harihara Veeramallu). భారీ అంచనాల మధ్య పలుమార్లు వాయిదా పడుతూ.. జూలై 24వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi) నుండి చిత్ర దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ (AM Jyothi Krishna). ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం (AM Ratnam) సమర్పణలో శ్రీ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) నటించారు అలాగే అనసూయ, సునీల్, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
రూ.127 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన వీరమల్లు..
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను.. తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4,500కు పైగా స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. పైగా ఈ చిత్రానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ.126 కోట్ల మేర బిజినెస్ జరిగింది. రూ.127 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. విడుదలై ఇప్పటికీ ఐదు రోజులు అవుతోంది. మరి ఈ ఐదు రోజులలో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది.. నిర్మాత లాభాల బాట పట్టారా? అసలు నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చిందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
హరిహర వీరమల్లు 5 డేస్ కలెక్షన్స్..
5వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే..5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 2 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగేతర రాష్ట్రాలలో ఒక కోటి గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఐదవ రోజు కేవలం రూ.3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రావడం గమనార్హం. ఇకపోతే ఐదు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్, రూ.74.58 కోట్ల నెట్ వసూలు చేసింది ఈ సినిమా.
నిర్మాత సేఫ్ అవ్వాలి అంటే..
ఇక నిర్మాత సేఫ్ అవ్వాలి అంటే.. ఇంకా రూ.53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది.అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.126 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే రూ. 127 కోట్ల నెట్ కలెక్షన్స్ రావాలి. ఇప్పటివరకు రూ.74.58 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ. 53 కోట్లు వస్తే అటు నిర్మాత ఏ.ఏం.రత్నం సేఫ్ అవుతారు.
నాలుగు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?
ముందుగా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. పెయిడ్ ప్రీమియర్ల ద్వారా రూ.8.5 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. మొదటి రోజు రూ.31.5 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు రూ.4కోట్లు, 3వ రోజు రూ.4కోట్లు, 4వ రోజు రూ.6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నైజాంలో రూ.18 కోట్లు, సీడెడ్ లో రూ.7.6 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.2 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.5.5 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.4.2 కోట్లు, కృష్ణాజిల్లాలో రూ.4.5 కోట్లు, నెల్లూరులో రూ.1.9 కోట్లు, గుంటూరులో రూ.5.2 కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తంగా ఆంధ్ర, నైజాంలో కలిపి రూ.54 కోట్ల షేర్, రూ.78 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది ఈ సినిమా.
ALSO READ: Sathi Leelavathi Teaser: సతీ లీలావతి టీజర్ రిలీజ్.. వీరకుమ్ముడు కుమ్మేసిన మెగా కోడలు!