E-Paper
Advertisement

Pithapuramlo: ‘పద్మశ్రీ’ పురస్కారం తర్వాత రాజేంద్రప్రసాద్‌ నుంచి వచ్చే చిత్రమిదే..

Pithapuramlo: ‘పద్మశ్రీ’ పురస్కారం తర్వాత రాజేంద్రప్రసాద్‌ నుంచి వచ్చే చిత్రమిదే..
Advertisement

Pithapuramlo: ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad)ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలలో ‘పద్మశ్రీ’ (Padma Shri) వరించిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ వచ్చిన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని, సెలబ్రిటీలెందరో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన కూడా ఈ అవార్డుకు ప్రేక్షకులే కారణమని ఓ వీడియోను విడుదల చేసి, సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా తాజాగా ‘పిఠాపురంలో’ (Pithapuramlo) చిత్రబృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ అప్డేట్‌ను తెలియజేసింది. పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే డా. రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం ‘పిఠాపురంలో’ కావడం తమ అదృష్టమని చిత్ర దర్శకుడు మహేష్ చంద్ర సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా మహేష్ చంద్ర ప్రశంసించారు. ‘పిఠాపురంలో’ సినిమా విషయానికి వస్తే..

Also Read- GPS: ఆ శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా! తరుణ్ భాస్కర్ ‘GPS’కు అర్థమిదే..

పోస్ట్ ప్రొడక్షన్ దశలో

Advertisement

‘ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం’ వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పిఠాపురంలో’. ‘అలా మొదలైంది’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, జూ. పవన్ కళ్యాణ్ తదితరులు ఇతక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్‌.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Also Read- Nagabandham: ‘నాగబంధం’లో బాలీవుడ్ ‘ఫైటర్’ ఫేమ్ రిషబ్ సాహ్నీ.. ఫస్ట్ లుక్ అరాచకం!

ఆకట్టుకునే అన్ని అంశాలున్నాయ్..

Advertisement

ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర (Mahesh Chandra) మాట్లాడుతూ.. ఇది ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ. ప్రస్తుత ఇంటర్ నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ. ఈ సినిమా చూస్తుంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని, చాలా కుటుంబాల్ని, ఎంతోమంది జీవితాలను చూస్తున్నట్టుగానే ఉంటుంది. అలాగని ఇదేదో పక్తు సెంటిమెంట్ సినిమా అని మాత్రం అనుకోవద్దు. ఇందులో ప్రేమ ఉంది. రొమాన్స్ ఉంది. వినోదం ఉంది. పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. చక్కని పాటలున్నాయి. అటు యువతని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో ‘పిఠాపురం’ పేరు ఎంతలా చర్చల్లో నిలిచిందో అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథను మలిచాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్యా మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.సి. క్రిష్ అందిస్తున్నారు.

Also Read- Vishwak sen: ఆ సినిమా చూసి బాలయ్య, తారక్ అన్న క్లాస్ పీకారు: విశ్వక్ సేన్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×