Bigg Boss 9:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ సిద్ధమయ్యింది. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధం అయింది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి ఈ షో ప్రారంభమవుతుందని మొదటి ప్రకటించినా పలు కారణాలవల్ల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇక ఈసారి ఎన్నడూ ఊహించని విధంగా ఏకంగా 5 మంది సామాన్యులను హౌస్ లోకి పంపించబోతున్నారు. హౌస్ లోకి సామాన్లను ఎలా సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో భాగంగా దాదాపు 20వేలకు పైగా అప్లికేషన్లను స్వీకరించి, అందులో పలు రౌండుల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు.
ఉత్కంఠ రేపుతున్న అగ్నిపరీక్ష మినీ షో..
ఇప్పుడు ఆ 45 మందికి అగ్ని పరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నవదీప్ (Navdeep), బిందు మాధవి(Bindu Madhavi), అభిజిత్ (Abhijeeth) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తూ ఉండగా.. ప్రముఖ యాంకర్ శ్రీముఖి (Sree Mukhi) హోస్ట్ గా వ్యవహరిస్తోంది. హౌస్ లోకి అడుగు పెట్టిన 45 మందికి భిన్నవిభిన్నమైన టాస్కులు నిర్వహిస్తూ.. రియల్ ఛాలెంజ్ లు ఇస్తూ వారిలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా శారీరకంగా , మానసికంగా, అటు తెలివి పరంగా ఎవరు ఎలా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనే విషయాలను బయటకు తీస్తున్నారు.
ఆకట్టుకుంటున్న అగ్ని పరీక్ష ప్రోమో..
అందులో భాగంగానే ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు జియో హాట్ స్టార్ వేదికగా అగ్ని పరీక్ష మినీ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 9వ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో శ్రీముఖి కంటెస్టెంట్స్ మధ్య ఉత్కంఠతను రేకెత్తిస్తూనే అప్పుడప్పుడు మధ్యలో తన కామెడీతో అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. పాట వస్తే నాగరాజు కాటేసినట్టే అంటూ.. ఒక్కొక్కరి బాక్సులో ఎలాంటి ఎమోజీలు ఉన్నాయో తన కామెడీతో పర్ఫామెన్స్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీముఖి. ముఖ్యంగా లీడర్ని ఎవరిని చేయబోతున్నారు అనే కాన్సెప్ట్ లో భాగంగా.. ఒక్కొక్కరికి ఒక్కో బాక్స్ ఇచ్చి అందులో ఉన్న ఎమోజీలను బయటపెట్టారు. సాడ్ ఎమోజి ఉంటే వారికి లీడర్షిప్ అందలేదు అని సమాచారం. అలా మిగిలిన కంటెస్టెంట్లు బాక్సులు అన్నీ చెక్ చేశారు అలా చెక్ చేస్తున్న సమయంలో కంటెస్టెంట్స్ మధ్య ఉత్కంఠ మామూలుగా లేదని చెప్పాలి. ఇక మొత్తానికైతే తాజాగా విడుదలైన ప్రోమో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
బిగ్ బాస్ 9..
మొత్తానికి అయితే అగ్ని పరీక్షలో భాగంగా 5 మందిని హౌస్ లోకి పంపించబోతున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ సీజన్లో సెలబ్రిటీలు కూడా భారీ రేంజ్ లోనే పార్టిసిపేట్ చేయనున్నారు. మరి ఈసారి టాస్క్ లు ఎలా ఉండనున్నాయి అనే విషయం మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే డబుల్ హౌస్, డబుల్ డోస్ , డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ హైప్ పెంచేశారు. మరి ఈ షో ఎలాంటి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ALSO READ:Telugu Film Chamber : వదల బొమ్మాళీ వదల… నేడు ఫిల్మ్ ఛాంబర్ ముట్టడి!