E-Paper
Advertisement

Prabhas: తెలుగు స్టార్ హీరోని భయపెడుతున్న ప్రభాస్ సినిమా దర్శకుడు..!

Prabhas: తెలుగు స్టార్ హీరోని భయపెడుతున్న ప్రభాస్ సినిమా దర్శకుడు..!
Advertisement

Prabhas: ప్రభాస్ సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఓం రౌత్ పేరు మరోసారి టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఓం రౌత్ ఇటీవలే ఒక ప్రముఖ తెలుగు హీరోకి కొత్త కథను వినిపించారు. అయితే ఆ కథను ఇప్పుడే చేయడానికి హీరో ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ దర్శకుడు ప్రభాస్ తో తీసిన ఆది పురిష్ సినిమా దృష్టిలో పెట్టుకొని.. ఆ హీరో భయపడి మరి.. కథ కూడా వినలేదు అని సమాచారం. దీంతో ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

 

Advertisement

ఈ కథా చర్చలు కొన్ని వారాల క్రితమే జరిగాయని, కానీ ఆ హీరో మాత్రం సినిమా ఒప్పుకోకుండా వెనక్కి తగ్గినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఓం రౌత్ గతంలో ఎదుర్కొన్న విమర్శలేనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 

ప్రభాస్ మర్చిపోలేని డిజాస్టర్..

Advertisement

 

ఓం రౌత్ చివరిగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎక్కువగా జరిగింది. ఈ నెగటివ్ టాక్ ఓం రౌత్ కెరీర్‌పై గట్టి ప్రభావం చూపింది.

 

ఆ తరువాత ఓం రౌత్ మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు రాలేదు. దీంతో ఆయన భవిష్యత్ సినిమాలపై సందేహాలు మరింత పెరిగాయి. ఆదిపురుష్ ఫలితం తర్వాత ఓం రౌత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

షాక్ ఇచ్చిన ప్రభాస్ డైరెక్టర్..

 

అయితే గత ఏడాది ఓం రౌత్ ఓ పెద్ద ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం జీవిత కథ ఆధారంగా “కలం: ది మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బయోపిక్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో తమిళ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయడం విశేషం.

 

ధనుష్ ఈ పాత్ర చేయడం తనకు గౌరవంగా ఉందని సోషల్ మీడియాలో తెలిపారు. ఓం రౌత్ కూడా డాక్టర్ కలాం జీవితాన్ని తెరపై చూపడం ఒక బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. అయినప్పటికీ ఈ సినిమా గురించి ఇప్పటివరకు స్పష్టమైన అప్డేట్ లేదు. ఈ పరిస్థితుల్లో ఓం రౌత్‌తో సినిమా చేయడానికి తెలుగు హీరోలు ఆలోచనలో పడుతున్నారని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

Also Read: Prabhas: నీ గొంతు నా మనసును తాకింది.. హీరోయిన్ పై ప్రభాస్ ప్రశంసలు..

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

Big Stories

Advertisement
×