E-Paper

Aqib Javed: మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే బాగు చేయ‌లేం

Aqib Javed: మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే బాగు చేయ‌లేం
Advertisement

Aqib Javed:  పాకిస్తాన్ క్రికెట్ (Pakistan cricket) పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారయింది. ముఖ్యంగా ఇండియాతో ఏ మ్యాచ్ జరిగిన ఓడిపోతూ అవమానాలను ఎదుర్కొంటోంది పాకిస్తాన్. మొన్న పురుషుల వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. మహిళల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో భాగంగా ఆదివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (Pakistan vs. Team India) జట్ల మధ్య మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగింది. ఇందులో అత్యంత దారుణంగా విఫలమైన పాకిస్తాన్ మహిళల జట్టు.. చిత్తుగా ఓడిపోయింది. ఇలా వరుసగా పురుషులు, మహిళల పాకిస్తాన్ జట్లు ఓడిపోతూ వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై కోచ్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్ర దండం వేసి పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే మార్చ‌లేం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఆకిబ్ జావేద్ (Aqib Javed). ఇప్ప‌టికిప్పుడు పాకిస్తాన్ క్రికెట్ ను మెరుగుప‌ర‌చ‌డం క‌ష్ట‌మే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Javed Miandad Vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

మంత్ర దండం వేసి, పాకిస్తాన్ క్రికెట్ ను రాత్రి రాత్రే మార్చ‌లేం

Advertisement

గత ఏడాది కాలంగా పాకిస్తాన్ పురుషుల జట్టు, అటు మహిళల క్రికెటర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా టీమ్ ఇండియా చేతిలో ఓడిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టును మెరుగుపరచాలని, అక్కడి క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా పాకిస్తాన్ తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రదండం వేసి రాత్రికి రాత్రే పాకిస్తాన్ క్రికెట్ జట్టును బాగు చేయవచ్చని జనాలందరూ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

కానీ ఇది జన్మలో జరగదని బాంబు పేల్చారు. ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిస్థితి, పతనాస్థితిలో ఉందని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో మంత్రదండాలు కాదు… అల్లా దిగివచ్చిన కూడా ఏం చేయలేడని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ లో కేవలం ఆటగాళ్ల‌ను… కెప్టెన్లను మార్చడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థలోనే లోతుగా మార్పులు చేయాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త‌ కోచ్ లుగా, సెలక్టర్లుగా ఎవరు వచ్చినా కూడా, పాకిస్తాన్ జట్టును గాడిన పెట్టడం ఉన్న ఫ‌లంగా కాద‌న్నారు. దీనికి చాలా టైం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. అందరూ ఓపిక పట్టాలని కోరారు. దీంతో ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Also Read:  Kamran Akmal Slams Pakistan Womens Team : బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

 

Related News

Kris Srikkanth: పాక్ ప్లేయ‌ర్లు క్రికెట్ మానేసి, ఇంట్లో మూల‌కు కూర్చోవ‌డం బెస్ట్

అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

గిల్లితే గిల్లించుకోవాలి కానీ, అరవకూడదు…వైభ‌వ్ కు వసీం జాఫర్ వార్నింగ్

ఇషాన్‌ కిషన్‌కు వీసా వ‌చ్చేసింది…వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత‌డు త‌ప్పుకోవాల్సిందే !

ఫాతిమా సనాకు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ‘ది హండ్రెడ్ 2026’ లోకి వైల్డ్‌కార్డ్

Tanveer Ahmed : నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

ఫాతిమా స‌నా గ్రేట్ లీడర్…ఆమె ఒక్క‌తే పోరాటం చేస్తే పాక్ గెల‌వ‌దు !

Big Stories

×