E-Paper
Advertisement

SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్ .. 13 కోట్ల ఓట్ల లెక్కేంటి?

SIRపై ప్రకాశ్ రాజ్ ఫైర్ .. 13 కోట్ల ఓట్ల లెక్కేంటి?
Advertisement

Prakash Raj:ఈ మధ్య సినిమాల కన్నా ప్రెస్ మీట్లలోనే ఎక్కువ కనిపిస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా మరోసారి ప్రెస్ ముందు ఎంట్రీ ఇచ్చాడు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ని ఆపేయాలంటూ ఫైర్ అయ్యాడు. ఖైరతాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో ఆయన ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తన అభిప్రాయాలను చెబుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

13 కోట్ల ఓట్లకి మంగళం

Advertisement

SIR పేరిట ఓట్లని ఇబ్బడి ముబ్బడిగా తీసేస్తున్నారని,అలా ఇప్పటికీ దాదాపు 13 కోట్ల ఓట్లకి మంగళం పాడారని వాపోయాడు. ఇప్పటికైనా తీసేసిన ఆ ఓట్లని మళ్ళీ పునరుద్దరించాలని, ముఖ్యంగా . ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించే విధానాన్ని ప్రజలకి అర్థం అయ్యేలా చెప్పాలని తెలిపాడు.ఒక వ్యక్తికి ఓటు హక్కు ఉందా లేదా అనే విషయం ఆ వ్యక్తికి తెలిపే క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని చెప్పుకొచ్చాడు.

SIR ప్రక్రియ మీద మరింత ఫోకస్

Advertisement

ఇక కర్ణాటకలో తాను స్వయంగా చేసిన పరిశీలించిన వివరాలని కూడా మీడియా ముందు చెప్పుకొచ్చాడు ఈ వెర్సటైల్ యాక్టర్. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100 పోలింగ్ బూత్‌లను పరిశీలించానని ఈ పరిశీలనలో చాలా మంది ఓటర్ల పేర్లు వారికి తెలియకుండానే లేక సరైన కారణాలు స్పష్టంగా లేకుండానే ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు తాను గుర్తించానని వాపోయాడు.అందుకే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ SIR ప్రక్రియ మీద మరింత ఫోకస్ పెట్టాలని అన్నాడు.

లిస్టు బిజేపీ నుండి వెళ్తుంది

ఇక ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం ఒక పరిపాలనా అంశంగా చూడకూడదని, అది డైరెక్ట్ గా ప్రజల ఓటు హక్కుతో ముడిపడి ఉన్న విషయమని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో “ప్రజలు అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించాలా? లేక ఎవరు ఓటు వేయాలో మీరు నిర్ణయిస్తారా?” అంటూ ఎలక్షన్ కమీషన్ పై మండిపడ్డాడు.ఇక సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో సంచలన కామెంట్స్ చేశాడు. ఎవరి ఓట్లు ఉండాలి, ఎవరి ఓట్లు తీసేయ్యాలి అనే లిస్టు బిజేపీ నుండి వెళ్తుంది అంటూ విరుచుకుపడ్డాడు.

ఇక ఈ SIR ప్రక్రియలో పేదలు, ఆదివాసీలు, మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించాడు ప్రకాశ్ రాజ్ . ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించే ప్రక్రియలో సామాజికంగా వెనుకబడిన వారికి ఎదురయ్యే సమస్యలను అధికారులు ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని కోరాడు.

ఇక ఇదే సమయంలో ఎన్నికల సంఘం వ్యవస్థలో 2023లో తీసుకొచ్చిన చట్టపరమైన మార్పులపైనా ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు. Chief Election Commissioner and Other Election Commissioners Act, 2023 ద్వారా ఎన్నికల సంఘం నియామక వ్యవస్థలో వచ్చిన మార్పులను రివైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కల్పించిన న్యాయపరమైన రక్షణను కూడా తొలగించాలని కోరాడు.

అటు నుండి ఎలాంటి కౌంటర్లు వస్తాయో !

ఎన్నికల సంఘానికి సంబంధించిన 2023 నుంచి ఉన్న అన్ని ఫైళ్లను వెంటనే సేకరించి పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరాడు ప్రకాష్ రాజ్. SIR పేరిట జరుగుతున్న అవకతవకలపై పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ఉండాలంటే ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని తెలిపాడు. మొత్తానికి మరోసారి తన SIR పేరిట బిజేపీ డ్రామాలాడుతుందని మరోసారి విమర్శల బాణాలని ఎక్కుపెట్టాడు ప్రకాష్ రాజ్.చూడాలి మరి దీనిపై అటు నుండి ఎలాంటి కౌంటర్లు వస్తాయో !

ALSO READ:సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈశ్వర్ సాయి…వివాదాలకు గుడ్‌బై చెప్పినట్టేనా?

Tags

Related News

అల్లు అర్జున్ పై వేణు స్వామి కామెంట్స్.. అక్కడికి వెళ్తే బన్నీతోనే అంటూ?

ఎస్కేఎన్ చేతుల మీదుగా ‘ధరణి ఐ లవ్ యు’ పోస్టర్ లాంఛ్!

నంది ఫిల్మ్ అవార్డుల పునరుద్ధరణ.. హర్షం వ్యక్తం చేసిన ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ !

వందల కోట్లు పోగొట్టుకున్న హీరో నవదీప్?

నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?

రష్మిక పిలిచినప్పుడు పలకకపోతే అలా అంటుందా? మొత్తం బయటపెట్టిన విజయ్!

Big Stories

Advertisement
×