Eshwar Sai Comeback: ఫోక్ ఇండస్ట్రీ లో బాసింగ బలాలే అంటూ మిలియన్ల వ్యూస్ ని వెనకేసిన ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చాడు. మాధురి రాథోడ్ తో రెడ్డి భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన సంగతి తెల్సిందే.
ఇక ఆ తర్వాత మాధురి రాథోడ్ నన్ను మోసం చేశాడు అని పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం,ఆ తర్వాత ఈశ్వర్ సాయి భార్య సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఇక నేను కూడా అంటూ మాధురి రాథోడ్ కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం వంటివెన్నో ఇష్యూస్ జరిగాయి కూడా.అయితే అవన్నీ సమసిపోయాయో లేక సర్దుబాటు చేసుకున్నారో తెలీదు కాని మొత్తానికి మళ్ళీ చాలా రోజులకి మీడియా ముందుకు వచ్చాడు ఈశ్వర్ సాయి.
తాజాగా ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో వస్తున్న ‘మొహబ్బత్’అనే సినిమా టీజర్ హైదరాబాద్ లో ఘనంగా లాంచ్ కాగా ఈ ఈవెంట్ కి నవదీప్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు,ఇక ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేస్తున్న ఈశ్వర్ సాయి ఈ ఈవెంట్ లో తళుక్కుమనడంతో అందరి కళ్ళు అతడి మీదికే మళ్ళాయి.ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈవెంట్ లో హీరో సంతోష్ రాజా కన్నా ఈశ్వర్ సాయే హైలెట్ అయ్యాడంటే ఆశ్చర్యం లేదు .
ఇక చాలా రోజులకి మీడియా ముందుకి రావడంతో ఒక్కసారిగా జర్నలిస్టులు తమ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఆ సంఘటన తర్వాత లైఫ్ ఎలా ఉంది, సాఫీగా సాగుతున్న కెరీర్ కి ఆ ఇష్యూ ఏమైనా ఎండ్ కార్డ్ వేసిందా , మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీ వైపు వెళ్తారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు.
ఇక వాటికి సమాధానమిస్తూ ఫోక్ ఆర్టిస్ట్ గా అవ్వకముందు తానొక నటుడిని అని,ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ,వెబ్ సిరీస్ లు చేసి ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చానని,అయినా ఫోక్ ఇండస్ట్రీ తనకి అన్నం పెట్టిందని,అలాంటి ఇండస్ట్రీని తాను అసలు మరచిపోనని చెప్పుకొచ్చాడు. కొందరు తెల్సి తెలియక ఫోక్ ఇండస్ట్రీ గురించి నెగెటివ్ గా మాట్లాడుతున్నారని, కాని ఫోక్ ఇండస్ట్రీ చాలా మంచిదని, వ్యక్తులు చేసిన తప్పుల వల్ల ఫోక్ ఇండస్ట్రీని తప్పు పట్టడం కరేజ్ట్ కాదని వాపోయాడు.
ఇక ఇక్కడ తప్పు చేయని వారు ఎవరూ ఉండరని, కానీ నేను దొరికిపోయానని ,దొరకని వారు చాలా మంది ఉన్నారని అన్నాడు.ఏది ఏమైనా తాను ఇండస్ట్రీలో నిలబడటానికే వచ్చానని, ఖచ్చితంగా అటు ఫోక్ ఇండస్ట్రీకి ,ఇటు సినిమా ఇండస్ట్రీకి సాలిడ్ గా కమ్ బ్యాక్ ఇస్తానని ఈశ్వర్ సాయి కాన్ఫిడెంట్ గా చెప్పడం విశేషం.
అయితే జర్నలిస్టులు అలాగే వరుస ప్రశ్నలు అడుగుతున్నా ఇప్పటికి ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం అంటూ ఎక్కడా ఓవర్ గా రియాక్ట్ కాకపోవడం మెచ్చుకోతగ్గ విషయం.చూడాలి మరి గత కొంతకాలం కిందటి వరకు వివాదాలకి కేరాఫ్ గా నిలిచిన ఈశ్వర్ సాయి ఇప్పుడెలా కమ్ బ్యాక్ ఇస్తాడో !
ALSO READ:నేను సన్నీ లియోన్ లాంటి వాడిని..అన్నీ విప్పేసా ..వేణు స్వామి వైరల్ కామెంట్స్ !