E-Paper
Advertisement

కాలేజీల్లో సినిమా ఫంక్షన్లు.. అవసరమా?

కాలేజీల్లో సినిమా ఫంక్షన్లు.. అవసరమా?
Advertisement

Toxic Pre-Release Event:మల్లారెడ్డి యూనివర్సీటీలో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశ్రుతి జరిగి ఇద్దరికి  తీవ్రగాయాలు అవడంతో ఇపుడు ఇలాంటి కాలేజీలలో సినిమా ఫంక్షన్స్ జరగాలా లేదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది.అసలే యూనివర్సిటీలు అంటే స్టూడెంట్స్ వేల సంఖ్యలో ఉంటారు.

ఇక తమ అభిమాన తారలు గనుక స్టేజీలపై ప్రత్యక్షమైతే టీనేజ్ లో ఉన్న కుర్రకారు పునకాలు వచ్చి ఎలా ఊగిపోతారో, ఎలాంటి హంగామా చేస్తారో చెప్పక్కర్లేదు.అలాంటిది అక్కడ ఒక ఈవెంట్ సింపుల్ గా, ఎలాంటి గొడవ లేకుండా అయిపోవాలని ఆశ పడటం అత్యాశే అవుతుంది.

“ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్”

Advertisement

ముద్దుగా “ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్”..అంటూ పెద్ద వాళ్ళకే ఈ సినిమా అని తాటికాయంత అక్షరాలతో క్యాప్షన్ పెట్టినప్పటికీ టీనేజ్ యూత్ ని మొత్తం వేల సంఖ్యలో అసెంబుల్ చేసి ఇక మీ తిప్పలు మీరు పడండి అని వదిలేయడం దారుణం.

ఈవెంట్ డ్రోన్ విజువల్స్ చూస్తే అర్థం అవుతుంది.స్టూడెంట్స్ అంతమందిని ఒకేదగ్గర కుక్కినట్టుగా ఎలా ఉన్నారో.అంతమంది పిలల్ని ఒకేదగ్గర అలా అసెంబుల్ చేయడం ఎంతవరకు సమంజసం.సినిమా వాళ్ళకి పబ్లిసిటీ కావాలి.పైగా అంతమంది యూత్ ని ఒకదగ్గారికి చేర్చాలంటే బోలెడంత ఖర్చు.ఇలా సింపుల్ గా ఒక పెద్ద కాలేజీని పట్టుకున్నామంటే ఈజీగా సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ వస్తుంది.

Advertisement

ఇక యూనివర్సీటీల యాజమాన్యాలకి అదో ప్రెస్టేజ్. తమ కాలేజీ పేరు మొత్తం మారుమోగిపోతుందన్న ఆశ ,ఇక మల్లారెడ్డి వంటి బడా పొలిటికల్ లీడర్స్ యొక్క కాలేజీలలో ఫంక్షన్స్ పెట్టుకుంటే పోలీసుల చుట్టూ పర్మిషన్స్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు.

పిల్లల ప్రాణాలు పొతే

అటు సినిమా యూనిట్ బాగానే ఉంటుంది,ఇటు కాలేజీల యాజమాన్యం బాగానే ఉంటుంది.కానీ వేలాది మందిలో ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నదే ఇక్కడ ప్రశ్న.నిన్న సౌండ్ బాక్సులపైకి ఎక్కిన విద్యార్థుల్లో ఇద్దరు గాయల పాలు అయ్యారు.అక్కడికి సరిపోయింది.

అదే ప్రాణాలు పొతే …ఎవరు తెచ్చిస్తారు.అసలు చదువుకునే కాలేజీల్లో ఈ ఈవెంట్స్ జరపాలన్న పిచ్చి ఏంటి ?పైగా మీరు గనుక సరిగ్గా లేకపోతె ,మళ్ళీ మన కాలేజీ లలో ఎవరూ ఈవెంట్లు జరుపుకోవడానికి ఆసక్తి చూపారు అంటూ సదరు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి మైక్ లో పిల్లలని హెచ్చరించడం గమనార్హం. జరపకపోతే ఏమవుతుంది..ఎవరికీ నష్టం.కానీ పిల్లల ప్రాణాలు పొతే మాత్రం తల్లిదండ్రులకి నష్టం.

also read :NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!

ఇలాగే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా?

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మల్లారెడ్డి యూనివర్సిటీ పై పోలీసులు కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి కేసులు పెట్టి మూడు రోజులు కాగానే కోల్డ్ స్టోరేజీ లోకి తోసేస్తారా లేక ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అసలు చదువుకునే కాలేజీలలో ఇలాంటి ఫంక్షన్లకి పర్మిషన్లు ఇవ్వకుండా కట్టడి చేస్తారా ..లేక కాదు కూడదు అంటూ ఇలాగే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతారా చూడాలి.

Tags

Related News

NBK111.. మాస్ జాతరకు డేట్ ఫిక్స్!

పరికిణీలో కుర్రకారు హృదయాలు దోచుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ బ్యూటీ!

‘టాక్సిక్’ ఎఫెక్ట్.. రవితేజ ‘ఇరుముడి’కి నష్టం తప్పదా?

వందకోట్ల ‘ఇరుముడి’?– ఇదీ రవితేజ స్టామినా !

అడ్వాన్స్ బుకింగ్స్ లో టాక్సిక్ సరికొత్త రికార్డు.. ‘A’ వచ్చినా డోంట్ కేర్!

మళ్లీ మొదలైన స్పిరిట్ వివాదం.. లాభాల్లో వాటాపై దీపిక కౌంటర్!

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశృతి.. కూలిన సౌండ్ స్పీకర్.. గాయపడ్డ విద్యార్థులు!

Big Stories

Advertisement
×