E-Paper
Advertisement

చిన్న సైజ్.. పెద్ద చరిత్ర.. BMW తలరాతను మార్చిన లెజెండరీ ఇసెట్టా గురించి మీకు తెలుసా?

చిన్న సైజ్.. పెద్ద చరిత్ర.. BMW తలరాతను మార్చిన లెజెండరీ ఇసెట్టా గురించి మీకు తెలుసా?
Advertisement

The Legendary BMW Isetta: ఈ రోజుల్లో చిన్న సైజు కార్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, దాదాపు 70 ఏళ్ల క్రితమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఓ చిన్న కారు మార్కెట్లోకి వచ్చింది. అదే BMW ఇసెట్టా. ఈ కారు కేవలం చిన్న సైజ్ తోనే కాదు. విభిన్నమైన డిజైన్‌తో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

BMW ఇసెట్టా డిజైన్ గురించి..

BMW ఇసెట్టా పొడవు కేవలం 2.2 మీటర్లు ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలో అత్యంత పాపులర్ మైక్రోకార్లలో ఒకటిగా చెబుతారు. ఎగ్ ఆకారంలో ఉండే ఈ కారులో సాధారణ కార్లలా సైడ్ డోర్లు ఉండవు. ముందు భాగమే ఓ డోర్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు స్టీరింగ్ వీల్ కూడా పక్కకు కదులుతుంది. దీంతో డ్రైవర్, ప్రయాణికులు సులభంగా కారులోకి ఎక్కే అవకాశం ఉంటుంది. చిన్న డిజైన్ వల్ల పార్కింగ్ కూడా చాలా సులభమయ్యేది. ఇరుకైన ప్రదేశాల్లో కారును నేరుగా ఫుట్‌ పాత్ వైపు ఆపి. ముందువైపు డోర్ ఓపెన్ చేసి దిగిపోయే వీలు ఉండేది. అప్పటి నగర పరిస్థితులకు ఇది చాలా ఉపయోగకరంగా మారింది.

1954లో BMW చేతికి ఇసెట్టా

Advertisement

వాస్తవానికి ఈ కారును మొదట ఇటలీకి చెందిన Iso సంస్థ రూపొందించింది. తర్వాత 1954లో BMW ఈ కారుకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసి, తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ఆ తర్వాత BMW సొంతంగా తయారు చేసిన 250 సీసీ మోటార్‌సైకిల్ ఇంజిన్‌ ను అమర్చింది. అనంతరం మరింత శక్తివంతమైన 298 సీసీ ఇంజిన్తో ఇసెట్టా 300 మోడల్‌ ను కూడా విడుదల చేసింది. ఈ చిన్న కారు సుమారు 13 నుంచి 15 హార్స్‌ పవర్ శక్తిని ఉత్పత్తి చేసేది. గరిష్టంగా గంటకు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించగలిగేది. చిన్న ఇంజిన్ ఉన్నప్పటికీ నగర ప్రయాణాలకు ఇది బాగా సరిపోయేది. ఇసెట్టా బరువు కూడా చాలా తక్కువ. కేవలం 320 కిలోలుఉండేది. తక్కువ బరువు కారణంగా ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందించేది. ఒక గ్యాలన్ ఇంధనంతో దాదాపు 78 మైళ్లు ప్రయాణించేది. ఆ టైమ్ లో ఇది చాలాఎక్కువ మైలేజ్‌.

దివాళా నుంచి BMW కంపెనీని కాపాడిన మోడల్

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత BMW కంపెనీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అలాంటి సమయంలో తక్కువ ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి మైలేజ్ కారణంగా ఇసెట్టాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ కారు అమ్మకాల వల్లే BMW ఆర్థికంగా కోలుకుని మళ్లీ బలమైన ఆటోమొబైల్ కంపెనీగా ఎదిగింది. అందుకే BMWను దివాళా నుంచి కాపాడిన కారుగా కూడా ఇసెట్టాకు ప్రత్యేక స్థానం ఉంది.ఇప్పటికీ ఈ కారు డిజైన్‌కు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దాని స్ఫూర్తితో ప్రస్తుత ఆటో కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ మైక్రోకార్లను రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా మైక్రోలినో లాంటి ఎలక్ట్రిక్ బబుల్ కార్లు BMW ఇసెట్టా డిజైన్‌ ను ఆధారంగా తీసుకుని తయారయ్యాయి. చిన్న పరిమాణం, సులభమైన పార్కింగ్, పర్యావరణహిత టెక్నాలజీతో ఇవి ఆధునిక నగరాల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.

Advertisement

Read Also: జస్ట్ రూ. 3 లక్షలకే క్యూట్ ఈవీ.. ఒకే ఛార్జ్ తో 300 కిలో మీటర్లు హ్యాపీగా వెళ్లొచ్చు!

Related News

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

Big Stories

Advertisement
×