BigTV English
Advertisement

HYDRA: హైడ్రాకు థాంక్స్ చెప్పిన పిల్లలు.. కబ్జాగాళ్లకు భలే బుద్ధి చెప్పారు!

HYDRA: హైడ్రాకు థాంక్స్ చెప్పిన పిల్లలు.. కబ్జాగాళ్లకు భలే బుద్ధి చెప్పారు!

HYDRA: హైదరాబాద్‌లో హైడ్రా వచ్చినప్పటి నుంచి నగర రక్షణ, విపత్తు నిర్వహణలో గొప్ప పాత్ర పోషిస్తుంది. ఇది వరదలు, అగ్నిప్రమాదాలు, భవనాల ఆక్రమణల వంటి విషయాల్లో వేగంగా స్పందిస్తోంది. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడుతుంది. అత్యాధునిక సాంకేతికత, శిక్షణ పొందిన సిబ్బందితో హైడ్రా 24/7 సేవలు అందిస్తుంది. డ్రోన్లు, జీపీఎస్, రియల్-టైమ్ మానిటరింగ్ వంటి సాధనాలతో విపత్తు ప్రాంతాల్లో తక్షణ సహాయం అందిస్తుంది. నగర ఆస్తుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణలోనూ హైడ్రా కీలకంగా వ్యవహరిస్తోంది. పర్యావరణ సంరక్షణ, చెరువుల సంరక్షణలో హైడ్రా పాత్ర అమూల్యం. హైదరాబాద్‌ను సురక్షిత, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో హైడ్రా గొప్పదనం స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం, మూసాపేటలోని ఆంజనేయ నగర్లో పార్కు ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా మంగ‌ళ‌వారం తొల‌గించింది.


అంజనేయ నగర్ లో 2000 గజాల పార్కు స్థలం క‌బ్జా అయ్యిందంటూ స్థానికులు సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉద‌యం 6 గంట‌ల‌కే హైడ్రా రంగంలోకి దిగింది. ఫటాఫట్ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. 25 ఏళ్ల క్రితం హుడా అనుమ‌తి పొందిన లే ఔట్ ప్ర‌కారం 2000 గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా హైడ్రా నిర్ధారించుకున్న త‌ర్వాత ఈ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ పార్కుచుట్టూ ప్ర‌హ‌రీ నిర్మించేందుకు రూ. 50 ల‌క్ష‌ల‌ను జీహెచ్ఎంసీ గ‌తంలో విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జ‌రిగింది. అక్క‌డ క‌బ్జాలు చేసిన వారు ప్ర‌హ‌రీ నిర్మాణాన్ని అడ్డుకోవ‌డంతో ప‌నులు ఆగిపోయాయి.

ALSO READ: AIIMS Jobs: ఎయిమ్స్‌లో 3501 ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే మీదే ఉద్యోగం, కాకపోతే 2 రోజులే..?


ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో మ‌సీదుకు పార్కుకు మ‌ధ్య ర‌హ‌దారి ఉంది. ర‌హ‌దారికి ఒక వైపు మ‌సీదును ఆనుకుని కొన్ని దుకాణ స‌ముదాయాలున్నాయి. అందులో యాసిన్ అనే వ్య‌క్తి టెంటు సామాన్లు, సౌండ్ సిస్టంతో పాటు.. జ‌న‌రేట‌ర్ల రిపేరు షాపును నిర్వ‌హిస్తున్నారు. పార్కు స్థ‌లం ఖాళీగా ఉండ‌డంతో కొన్ని టెంటు సామాన్లు అందులో ఉంచ‌డంతో క‌బ్జాల ప‌ర్వాన్ని ప్రారంభించారు. టెంట్ సామాన్లు, సౌండ్ సిస్టమ్ మెటీరియల్, జనరేటర్ల రిపేరింగ్ తదితర వ్యాపార కార్యక్రమాలకు వినియోగించ‌డం ప్రారంభించారు. ఈయ‌న‌కు మ‌సీదులో మ‌త‌బోధ‌కుడు మాలిక్ కూడా స‌హ‌క‌రించార‌ని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. అక్క‌డ జెండాను నిల‌బెట్టి క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప్ర‌జావాణి ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు. లేఔట్ ప్రకారం 2 వేల గజాల స్థలం పార్కు కోసం కేటాయించినట్టు నిర్ధారించుకున్న హైడ్రా ఆ ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. తాత్కాలికంగా వేసుకున్న షెడ్డును కూడా తొల‌గించింది.

ALSO READ: snake in temple: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని.. బుసలు కొట్టిన నాగుపాము, వీడియో చూశారా?

పార్కుకు గ‌తంలో ప్ర‌హ‌రీ ఉంది. ఆ ప్ర‌హ‌రీని చాలా వ‌ర‌కు మ‌ట్టితో నింపేసి.. కొన్న చోట్ల కూల‌గొట్టిన ఆన‌వాళ్లున్నాయి. లే ఔట్ ప్ర‌కారం.. హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీంతో స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తో పాటు హైడ్రా సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. త‌మ కాల‌నీ పిల్ల‌లు ఆడుకునే స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా అంటూ సంతోషం వ్య‌క్తం చేశారు.

Related News

Telangana: ఎమ్మెల్సీ కవిత.. ఎంత మాటన్నారు.

Hyderabad: నాచారంలో దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య

Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

Jubileehills Bypoll: జూబ్లీహిల్స్ తెరపైకి జనసేన.. టీడీపీ మౌనం కాంగ్రెస్ కి లాభమేనా?

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Say No to Drug: ‘సే నో టు డ్రగ్స్’ పేరుతో రాష్ట్రంలో క్రికెట్ టోర్నమెంట్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ.80 లక్షలు

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Big Stories

×