E-Paper
Advertisement

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!

బ్లూ శారీలో అదరగొట్టిన ప్రీతి ముఖుందన్.. అందం మామూలుగా లేదుగా!
Advertisement

Preity Mukhundhan:ప్రీతి ముఖుందన్..అందంతో పాటు అభినయం కలిగిన ముద్దుగుమ్మల్లో ఈ భామ టాప్ ప్లేస్ లో ఉంటుంది.ఇదిగో అలాంటి ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు మంటలు పుట్టిస్తున్నాయి.

“Timeless elegance, always” అంటూ ఈ ఫోటోలను పోస్ట్ చేసిన ప్రీతి. బ్లూ కలర్ చీరలో ఆదరగోడుతూ అభిమానులను ఫిదా చేస్తోంది.ఇక బ్యూ కలర్ చీరకు మ్యాచింగ్‌గా డిజైన్ చేసిన బ్లౌజ్, మెడలో నెక్లెస్, చేతికి బ్రేస్‌లెట్స్‌తో ప్రీతి లుక్ అదిరిపోయిందనే చెప్పాలి.ముఖ్యంగా మేకప్ హడావుడి లేకుండా సింపుల్‌గా కనిపిస్తూ తన అందంతో ఫాలోవర్స్ ని ఫిదా చేసేసింది. అందునా ఆమె హెయిర్ స్టైల్, చీరకట్టిన తీరు ఈ ఫోటోలకు మెయిన్ ఎసెట్ గా నిలిచింది.

Advertisement

సాధారణంగా హీరోయిన్లు మోడ్రన్ డ్రెస్సుల్లో ఫోటోషూట్లు చేస్తుంటారన్న సంగతి తెల్సిందే. కానీ ప్రీతి మాత్రం ట్రెడిషనల్ లుక్‌లోనూ తన స్టైల్ ఏంటో చూపించిందనే చెప్పాలి. దీంతో ఆమె ఫోటోలు చూసిన అభిమానులు మా ప్రీతి అందం ఎవర్ గ్రీన్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ప్రీతి ముఖుందన్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ మొదట్లో మోడలింగ్, మ్యూజిక్ వీడియోలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు పట్టేసింది.అలా తమిళం, తెలుగు, మలయాళ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్‌ ని జెట్ స్పీడ్ లో తీసికెళ్తుంది. ఇంజినీరింగ్ చదివిన ప్రీతి, సినిమాల మీద ఆసక్తితో నటన వైపు అడుగులు వేసి ఇప్పుడు ఒక్కో సినిమాతో ప్రేక్షకులకు అలరించడానికి ట్రై చేస్తుంది.

Advertisement

ఇక తెలుగు విషయానికి వస్తే ప్రీతి ముఖుందన్ ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో పరిచయమైందన్న సంగతి తెల్సిందే. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆమె జలజాక్షిగా కనిపించి అలరించింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.

ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘కన్నప్ప’ సినిమాలో నెమలి పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటించిన సినిమా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదన్న సంగతి తెల్సిందే.

ఇక తమిళంలో కవిన్ హీరోగా నటించిన ‘స్టార్’ సినిమా కూడా ప్రీతి కెరీర్‌లో మంచి సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో మీరా మలర్కోడి పాత్రలో కనిపించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
ఇక మలయాళంలో ‘మైనే ప్యార్ కియా’, ‘సర్వం మాయ’ వంటి సినిమాలతోనూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ.అలా ఒక్క భాషకే పరిమితం కాకుండా వేర్వేరు ఇండస్ట్రీల్లో ఛాన్స్ లు దక్కించుకోవడం విశేషం.

ప్రీతి ముఖుందన్‌కు సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోల ద్వారా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ‘ఆసా కూడ’ పాటతో ఆమెకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది . ఆ తర్వాత ఫోటోషూట్లు, ఫ్యాషన్ పోస్టులతో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌లో కనిపిస్తూ తన స్టైల్‌తో ఆకట్టుకుంటున్న ఈ భామ  ఇప్పుడు బ్లూ శారీలో షేర్ చేసిన ఫోటోలతో మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Tags

Related News

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

RC 17 షూటింగ్ పై సుకుమార్ బిగ్ అప్డేట్… ప్రయాణం ప్రారంభం!

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

Big Stories

Advertisement
×