E-Paper
Advertisement

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ

వద్దనుకున్న లవర్ సడన్‌గా లైఫ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తే… ఆ కిక్కే వేరప్పా… ఓటీటీలోకి ఎమోషనల్ మూవీ
Advertisement

Romantic Drama OTT : ఒకరిని ప్రాణంగా ప్రేమించినా, జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఆ ప్రేమను వదులుకోవాల్సి వస్తే ? ప్రేమించిన వ్యక్తిని కాదని మరో జీవితాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ నిర్ణయం తప్పని తెలిసి తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ప్రేమ, పెళ్లి, కుటుంబం ఆశించే భద్రత మధ్య ఒక యువతి ఎదుర్కొనే సంఘర్షణను చూపించే కన్నడ చిత్రమే ‘లైఫ్ టుడే’ (Life Today). మరి ఈ ఎమోషనల్ మూవీని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

కథ చిక్‌మగళూరులో నివసించే అమృత కుటుంబంతో మొదలవుతుంది. గణేశ్ అనే తండ్రి, మంగళ అనే తల్లి తమ కూతురు అమృతతో ఉంటారు. అయితే గణేశ్ పని చేసే చోట స్థానిక రౌడీలతో సమస్య మొదలవడంతో ఆ కుటుంబం ప్రశాంతతకు విఘాతం కలుగుతుంది. ఈ క్రమంలో అమృతకు కూడా ప్రమాదం ఎదురవుతుంది. అదే సమయంలో శివ ఆమెకు అండగా నిలుస్తాడు. అనాథగా పెరిగిన శివ జీవనోపాధి కోసం వెల్డింగ్ షాప్ నడుపుతుంటాడు.

Advertisement

ఎక్కువగా సింగిల్ గా ఉండే అతడు, అమృత జీవితంలోకి వచ్చిన తర్వాత క్రమంగా మారతాడు. ఆమెకు కష్టం వచ్చిన ప్రతిసారీ సహాయం చేస్తూ, ఆమెను రక్షించేందుకు ముందుకొస్తాడు. మొదట పరిచయంగా మొదలైన వీరి అనుబంధం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. శివ కూడా అమృతను గాఢంగా ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అమృత కోరుకుంటుంది. కానీ వీరిద్దరి ప్రేమకు కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తుపై ఉండే ఆలోచనలు అడ్డుగా నిలుస్తాయి.

అమృత తండ్రి గణేశ్ తన కూతురికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాడు. అయితే అతడి దృష్టిలో మంచి జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు… ఆర్థిక స్థిరత్వం, సామాజిక హోదా కూడా ముఖ్యమే. అమృత మాత్రం శివతో కలిసి జీవించాలని ఆశపడుతుంది. ఇలా ప్రేమించిన వ్యక్తితో ఉండాలనే మనసు ఒకవైపు, కుటుంబం కోరుకునే భద్రమైన భవిష్యత్తు మరోవైపు ఆమెను ఇబ్బందుల్లోకి నెడతాయి. చివరకు అమృత శివను వదిలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అతడు తీవ్రంగా బాధపడతాడు.

Advertisement

అయితే అమృత ఎంచుకున్న కొత్త జీవితం కూడా ఆమె ఆశించినట్లు సాగదు. ఆ పెళ్లి పెటాకులు అయ్యాక తర్వాత ఆమె మళ్లీ శివ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఒకప్పుడు తనను వదిలేసిన అమృతను శివ తిరిగి అంగీకరించగలడా ? గతంలో ఎదురైన బాధను మర్చిపోయి ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించగలరా ? ప్రేమకు రెండో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమేనా ? అన్నది కథలో చూడాల్సిన భావోద్వేగ మలుపు.

Also Read : ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

ఏ ఓటీటీలో ఉందంటే ?

‘లైఫ్ టుడే’లో కిరణ్ ఆదిత్య, లేఖ చంద్రలతో పాటు టబలా నాని, యుక్త పెర్వి, కాక్రోచ్ సుధీ తదితరులు నటించారు. వి. శ్రీధర్ సంభ్రమ్ సంగీతం అందించారు. ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT)లో కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో అందుబాటులో ఉన్నారు.

Tags

Related News

బందిపోటుగా మారే స్వాతంత్ర్య సమరయోధుడు… ఓటీటీలోకి బెంగాలీ యాక్షన్ బయోపిక్

గ్రహణం రోజే పాడుబడిన స్కూల్లోకి యూట్యూబర్స్‌… కెమెరాలు తిరిగొచ్చాయి కానీ మనుషులు మాయం… 8.4 రేటింగ్‌ ఉన్న కన్నడ హారర్ థ్రిల్లర్

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

Big Stories

Advertisement
×