E-Paper
Advertisement

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 మునుపెన్నడూ లేనివిధంగా ఆడియన్స్ కు సరికొత్త వినోదాన్ని పంచుతోంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తవగా.. తాజాగా 39వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో టెంపర్ వంశీ తన చెంపపై కొట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వంశీ తాను చేసిన మిస్టేక్ కి తానే పనిష్మెంట్ ఇచ్చుకోవడం ఈ ప్రోమోలో వైరల్ గా మారింది.

గోల్డ్, గ్రీన్ టీం మధ్య బోనస్ పాయింట్ కోసం టాస్క్..

తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. నిన్నటి ఎపిసోడ్ లో కంటెండర్ షిప్ కోసం హౌస్ మేట్స్, వైల్డ్ కార్డ్స్ ని కలిపి మూడు టీములుగా విడగొట్టారు బిగ్ బాస్. అందులో ఒక్కొక్క టీం కి 6 చొప్పున కుర్చీలు ఇచ్చారు. అందులో వైల్డ్ కార్డ్స్ కి ఒక కుర్చీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇక ఎవరు ఎక్కువ కుర్చీలను సంపాదించుకుంటారో వారు కెప్టెన్సీ పదవికి పోరాడే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో నిన్న జరిగిన టాస్క్ లో గ్రీన్ , గోల్డ్ టీమ్స్ సమానంగా ర్యాంకింగ్ అందుకోవడంతో ఇప్పుడు బోనస్ టాస్క్ నిర్వహించారు బిగ్బాస్. గెలిచిన సభ్యులకు మాత్రమే బోనస్ పాయింట్స్ లభిస్తాయి అంటూ టాస్క్ నిర్వహించారు అలా గోల్డ్ టీం తరపున శివ్ , గ్రీన్ టీం తరఫున వంశీ టాస్క్ లో పోటీపడ్డారు.

చిన్న మిస్టేక్.. గట్టిగా కొట్టుకున్న వంశీ..

Advertisement

“గార్డెన్ ఏరియాలో ఒకచోట ప్లేట్ బౌల్ దాచిపెట్టడం జరిగింది. బజర్ మోగాక దానిని పెడస్టల్ మీద పెట్టి, బెల్లు మోగించాలి” అంటూ టాస్క్ వివరించారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో వంశీ ప్లేటు , బౌల్ కనిపెట్టగలిగారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన సమాచారాన్ని ఆయన పూర్తిగా వినకుండానే బెల్ మోగించి.. ప్లేటు బౌల్ చేతిలో పట్టుకొని బెల్ ని మాత్రం ఆయన పెడస్టల్ మీద పెట్టాడు. ఇక సంచాలక్ గా వ్యవహరించిన త్రిగుణ్.. పెడస్టల్ మీద ఉన్న బెల్ తీయగా.. పక్కనే ఉన్న శివ అప్రమత్తమై వంశీ చేతిలో ఉన్న ప్లేట్ లాగేసుకొని పెడస్టల్ మీద పెట్టాడు. ఆ తర్వాత వంశీ బౌల్ పెట్టాడు. వర్షిని చెబుతున్నా కూడా ఆయన సరిగా వినిపించుకోలేదు. ఆ తర్వాత ప్లేటు, బౌల్ రెండు పెడస్టల్ మీద పెట్టి బెల్ మోగించాడు. అలా గ్రీన్ టీం కి ప్లేట్ బౌలు దొరికినప్పటికీ వారు సరిగా ప్లేస్ చేయకపోవడం వల్ల టాస్క్ లో ఓడిపోయారు.

also read:హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

గిల్టీ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ..

Advertisement

ఇక ఇక్కడ మైండ్ స్ట్రాటజీ ఉపయోగించిన శివ్ బిగ్ బాస్ చెప్పిన టాస్క్ లో విజేతగా నిలిచారు. అయితే బిగ్ బాస్ చెప్పిన విషయాన్ని వంశీ సరిగ్గా వినకపోవడం వల్లే.. టాస్క్ లో ఓడిపోయామనే బాధతో.. తన చేతులతో తన చెంపపై గట్టిగా కొట్టుకొని, తాను చేసిన మిస్టేక్ కి కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికైతే వంశీ అలా కన్నీళ్లు పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది . ఏది ఏమైనా ఇలాంటి గేమ్స్ లో బుద్ధి బలం చాలా ఇంపార్టెంట్ అని మరోసారి శివ్ నిరూపించారు.

 

Related News

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×