E-Paper
Advertisement

‘రాఖ్’ వెబ్ సీరిస్.. గుండె బరువెక్కించే రియల్ స్టోరీ, 1978లో ఏం జరిగిందంటే..

‘రాఖ్’ వెబ్ సీరిస్.. గుండె బరువెక్కించే రియల్ స్టోరీ, 1978లో ఏం జరిగిందంటే..
Advertisement

Raakh True Story: ఇటీవల విడుదలైన ‘రాఖ్’ (Raakh) చిత్రం భారతదేశ నేర చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఒక పాత విషాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. అది 1978వ సంవత్సరం.. దేశ రాజధాని ఢిల్లీని ఉలిక్కిపడేలా చేసిన గీతా చోప్రా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు తోబుట్టువుల కిడ్నాప్, దారుణ హత్యోదంతం అది. ఒక నేవీ అధికారి పిల్లలైన ఆ ఇద్దరూ ఆల్ ఇండియా రేడియో (AIR) కార్యక్రమంలో పాల్గొనడం కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కిడ్నాప్‌నకు గురయ్యారు. కుల్జీత్ సింగ్ (అలియాస్ రంగా), జస్బీర్ సింగ్ (అలియాస్ బిల్లా) అనే ఇద్దరు కరడుగట్టిన నేరస్థులు ఆ అమాయక పిల్లలను అపహరించి, తీవ్ర చిత్రహింసలకు గురిచేసి అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ నరమేధం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలను, నిరసనలను రేకెత్తించింది.

Read also-గ్లోబల్ బాక్సాఫీస్‌పై కార్తి దండయాత్ర.. ‘సర్దార్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Advertisement

ఈ కేసు భారతదేశ క్రిమినల్ విచారణల చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న కేసుగా నిలిచింది. నిందితులు రంగా, బిల్లాలు కిడ్నాప్, అత్యాచారం, హత్యకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. దిగువ కోర్టు విధించిన మరణశిక్షను దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కూడా సమర్థించడంతో, 1982లో వీరిద్దరినీ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ప్రాణాపాయంలో ఉన్నప్పటికీ ఆ కిడ్నాపర్లను ఎదిరించి, వారు చూపిన అసమాన ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గీతా చోప్రా, సంజయ్ చోప్రాలకు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన ‘కీర్తి చక్ర’ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. నేటికీ దేశంలో పిల్లలకిచ్చే జాతీయ సాహస అవార్డులను వీరి జ్ఞాపకార్థమే ప్రదానం చేస్తున్నారు.

Related News

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×