E-Paper
Advertisement

రూ.43 కోట్ల చెక్కుల వివాదం.. రాధాపై అంబికా షాకింగ్ కామెంట్స్!

రూ.43 కోట్ల చెక్కుల వివాదం.. రాధాపై అంబికా షాకింగ్ కామెంట్స్!
Advertisement

Ambika Radha:రాధ ..ఇప్పటి తరానికి ఈవిడ పేరు పెద్దగా తెలీకపోవచ్చు.కానీ ఒకప్పుడు చిరుతో కల్సి ఈ వెటరన్ స్టార్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా తన ఆఫీసులో పన్నులు ,ఖర్చుల నిమిత్తం తాను స్వయంగా సంతకం చేసి పెట్టిన రూ.43.62 కోట్ల విలువైన చెక్కులు మాయమయ్యాయని దీని వెనకాల తన అక్క అంబికా, తమ్ముడు అర్జున్ నాయర్‌ లు ఉన్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం మెట్లు ఎక్కడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

తన ఆఫీస్ లో పెట్టిన చెక్ లని క్యాష్ గా మార్చుకునేందుకు ప్రయత్నించారని,అయితే బ్యాంకు నుండి తమకి సమాచారం రావడంతో ఆ ట్రాన్సాక్షన్ ని ఆపేసినట్టు తెలిపింది.తనకు తన అక్కకి ,తమ్ముడికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపించుకునేంత సంబంధాలు ఏమీ లేవని కుండ బద్దలు కొట్టేసింది.

Advertisement

అయితే ఇదే వ్యవహారంపై రియాక్ట్ అయింది అక్క అంబికా. తనపై ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కావడం లేదని, అసలు విషయం చెప్పాలంటే ఇందులో తానే నష్టపోయానని వాపోయింది. ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్లడం తనకు బాధ కలిగించిందని , ఎవరో ఇచ్చిన సలహాతోనే రాధా ఫిర్యాదు చేసి ఉండొచ్చని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

ఇక రాధ చేతుల్లో ఉన్న ARS Garden అనేది కేవలం ఓ ఆస్తి కాదని .. తమ కుటుంబ జీవితంతో ముడిపడిన జ్ఞాపకమని, కుటుంబం కష్టాల్లో ఉన్న రోజుల్లో సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తుల్లో ARS Garden ఎంతో ప్రత్యేకమైనదని తెలిపింది.

Advertisement

కొందరు చెబుతున్నట్లుగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం ఎంజీఆర్ తమ కుటుంబానికి 25 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారనే ప్రచారం ఉత్తి అబద్దమని ,తమ కష్టార్జితంతోనే ఆ ఆస్తిని కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. అయితే ఇదే గార్డెన్ కి సంబంధించిన భూమిని నిజంగానే ఎంజీఆర్ ఉచితంగా ఇచ్చారనే మాటల్ని ఇప్పటికీ పలువురు సీనియర్ జర్నలిస్టులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండటం గమనార్హం.

ఇక తనకు ఎంతో బాధ కలిగించిన సంఘటనల్లో ARS Garden పేరు బోర్డు మార్చడం ఒకటని చెబుతుంది అంబికా.ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న ఆ ప్రదేశం పేరు బోర్డు తొలగించి మరో బోర్డు పెట్టడం చూసి తట్టుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యింది. ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ARS Garden పేరు తమిళ సినిమా ప్రపంచానికి బాగా తెలుసని, అందుకే దానితో తనకు ఉన్న అనుబంధం మరింత ప్రత్యేకమని బాధ పడిపోయింది.

ఇక ఇదే ARS Garden కేస్ కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలను బయటకు చెప్పలేనని స్పష్టం చేశారు. ఈ వివాదం కేవలం ఆస్తి, డబ్బు వ్యవహారంగా కాకుండా కుటుంబ బంధాల మధ్య వచ్చిన దూరంగా కూడా కనిపిస్తోంది. తాము కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబం కోసం ఏమైనా చేయాలని భావించేవాళ్లమని అంబికా గుర్తుచేసుకున్నారు.

also read :అషు రెడ్డి గ్లామర్ షో.. . సోషల్ మీడియాలో కిర్రాక్ రెస్పాన్స్!

ఏదేమైనా .. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అక్కాచెల్లెళ్లుగా అభిమానులను అలరించిన అంబికా, రాధా ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి, చెక్కుల వివాదంతో వార్తల్లో నిలవడం నిజంగా బాధాకరం .చూడాలి ఈ చెక్కుల వివాదానికి ఎక్కడ చెక్ పడుతుందో

Tags

Related News

రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!

డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!

నిహారికకు నేషనల్ అవార్డు.. నాగబాబు పోస్ట్ వైరల్.. వారసత్వం బంగారం అంటూ!

పుష్ప మంగళం శీను క్యారెక్టర్ మిస్ చేసుకున్న నటుడు.. రాసి పెట్టలేదంటూ!

ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృవియోగం!

తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!

బ్లడ్ అమ్ముకుని సంపాదించాల్సిన ఖర్మ నాకేంటి? చిరు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×