Raj Nidimoru Ex Wife Shhyamali De Post: సమంత మళ్లీ ఫాంలోకి వచ్చింది. సినిమాల్లో కాదు.. సోషల్ మీడియాలోకి. అదేంటని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మొన్నటి వరకు ఎమోషనల్, స్పిర్చ్యుల్ కోట్స్ షేర్ చేసిన సమంత ఈ మధ్య ఫుల్ జోష్లో కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఇంత హ్యాపీ కినిపంచింది లేదు. గత నాలుగేళ్లుగా ఆమె మూడాఫ్గానే కనిపించింది. మూవీ ఈవెంట్స్లో అయితే కన్నీరు పెట్టకుండ ఉండలేకపోతుంది. తన గురించి పొగిడిన చాలు.. ఎమోషనల్ అవుతుంది. తెరపై లవ్స్టోరీ చూసినా.. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగేవి. ఇంటర్య్వూల్లోనూ తన మనసు ఎంతో భారంగా ఉందన్నట్టు కనిపించేది. దానికి తోడు మయోసైటిస్ వ్యాధి.. తనని మరింత క్రుంగదీసింది.
ఇక సినిమాలకు గ్యాప్ తీసుకుని మరి మయోసైటిస్కి చికిత్స తీసుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకున్న ఆమె ఇటీవల నిర్మాతగా మారింది. ట్రాలాలా పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించి.. శుభం మూవీ తెరకెక్కించింది. ఈ మూవీ ప్రమోషన్స్ నుంచి సామ్ ఫుల్ యాక్టివ్గా కనిపిస్తోంది. అప్పటి నుంచి తను ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ని అభిమానులతో పంచుకుంటుంది. ఎక్కడికి వెళ్లిన డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో జంటగా కనిపిస్తోంది. ఫ్లైయిట్లో అతడి భుజంపై వాలి ఫోటో షేర్ చేసి ఒక్కసారిగా రూమర్స్కి తెరలేపింది. అప్పటికే సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. ఆమె పోస్ట్స్ వాటికి మరింత బలాన్ని ఇచ్చాయి.
ఆ తర్వాత కూడా దుబాయ్ వెకేషన్లో కూడా రాజ్ నిడిమోరుతో కనిపించింది. ఆ మధ్య స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో రాజ్ నిడిమోరు చేయి పట్టుకుని కనిపించింది. రెండు రోజుల క్రితం సమంత దుబాయ్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె చాలా ఆనందంగా కనిపించింది. చిన్న పిల్లలా అల్లరి చేస్తూ.. ఫుల్ జోష్లో ఉంది. ఇందులో ఓ వ్యక్తి చేయి పట్టుకుని ఊపుతూ కనిపించింది. అది రాజ్ నిడిమోర్ అని అర్థమైపోతుంది. దీంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే సమంత రాజ్ నిడిమోరుతో కలిసి పోస్ట్స్ చేస్తుంటే.. మరోవైపు ఆయన భార్య శ్యామలి దే సోషల్ మీడియాలో వేదికగా ఆసక్తిక పోస్ట్స్ పెడుతోంది.
ఇవి పరోక్షంగా సమంత, రాజ్ని ఉద్దేశిస్తూ ఉండటంతో ఈ వ్యవహరం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె పోస్ట్స్ ఇన్డైరెక్టర్ సమంత వార్నింగ్ ఇస్తున్నట్టుగా అనిపస్తుంటాయి. అయితే తాజాగా దుబాయ్ వీడియో షేర్ చేసిన ఆనంతరం శ్యామలి దే మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో రెండు కోట్స్ షేర్ చేసింది. ‘తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించండి‘ అని తన పోస్ట్లో ఉంది. అలాగే మరో పోస్ట్లో ‘నిష్పాక్షికత అంటే ఇక్కడ మీరు ఏది సొంతం చేసూకోకూడదు.. అలాగే ఏదీ కూడా మిమ్మల్ని సొంత చేసుకోకూడదు‘ అని రాసింది. అయితే సమంత వీడియో పోస్ట్ చేసిన తర్వాత శ్యామలి దే ఇలాంటి వార్నింగ్ పోస్ట్స్ చేయడంతో అవి వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది సమంతకు కౌంటర్లా ఉందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.