Indian Railways: భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతుంది. ఇందుకోసం ఏకంగా 13 వేల రైళ్లను నడుపుతుంది. ఆయా రైళ్లు దేశంలోని నగరాలు, పట్టణాలతో పాటు పలు గ్రామాలను కలుపుతూ ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. తక్కువ ఖర్చు, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవం కారణం ఎక్కువ మంది ట్రైన్ జర్నీకి ఇష్టపడుతున్నారు. కానీ, కొన్నిసార్లు రైల్వే ట్రాక్ మరమ్మతులు, టెక్నికల్ అప్ గ్రేడ్స్ కారణంగా పలు రైళ్లు రద్దు అవుతుంటాయి. అందులో భాగంగానే ఆగస్టు నెలలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే వెల్లడించింది. ఒకవేళ మీరు రైల్లో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే.. మీ రైళ్ల వివరాల గురించి రైల్వే స్టేషన్ కు వెళ్లి తెలుసుకున్న తర్వాతే టికెట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆగస్టులో రద్దు అవుతున్న రైళ్ల వివరాలు
ట్రాక్ మరమ్మతులు, టెక్నికల్ అప్ గ్రేడ్స్ కారణంగా, అనేక రైళ్ల ఆపరేషన్ ప్రభావితం కానుంది. చక్రధర్ పూర్ డివిజన్ లోని కొన్ని సెక్షన్లలో ట్రాక్ మెయింటెనెన్స్ కారనంగా కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరికొన్నింటిని డైవర్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రాంచీ మార్గం ఎక్కువగా ప్రభావితమవుతోంది. ఈ రూట్ లో ప్రయాణించే చాలా రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. మరికొన్ని తాత్కాలికంగా రద్దు చేయబడ్డాయి. మీ ప్రయాణం ఈ మార్గం నుంచి కొనసాగితే, వెంటనే మీ ట్రైన్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది.
⦿ హతియా – ఝార్సుగూడ – హతియా మెము ఎక్స్ ప్రెస్
హతియా – ఝార్సుగూడ – హతియా MEMU ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 18175/18176 ) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు రద్దు చేయబడుతుంది.
⦿ చర్లపల్లి – దర్భంగా ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 17007) ఆగస్టు 26, సెప్టెంబర్ 9 తేదీలలో రద్దు అవుతుంది.
⦿ దర్భంగా – చర్లపల్లి ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17008) 29 ఆగస్టు, సెప్టెంబర్ 12 తేదీలలో రద్దు చేయబడుతుంది.
⦿ విశాఖపట్నం – బనారస్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 18523) 27 ఆగస్టు, ఆగస్టు 31, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 10 తేదీలలో రద్దు చేయబడుతుంది.
⦿ బనారస్ – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 18524) ఆగస్టు 28, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 8, సెప్టెంబర్ 11 తేదీల్లో రద్దు చేయబడుతుంది.
⦿ హైదరాబాద్ – రక్సౌల్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17005) ఆగస్టు 28న రద్దు చేయబడుతుంది.
⦿ రక్సౌల్ – హైదరాబాద్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 17006) ఆగస్టు 31న రద్దు చేయబడుతుంది.
⦿ చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్(రైలు నంబర్ 07051) ఆగస్టు 30న రద్దు చేయబడుతుంది.
⦿ రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్(రైలు నంబర్ 07052) సెప్టెంబర్ 2 రద్దు చేయబడుతుంది.
⦿ చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్(రైలు నంబర్ 07005) సెప్టెంబర్ 1న రద్దు చేయబడుతుంది.
⦿ రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్(రైలు నంబర్ 07006) సెప్టెంబర్ 4న రద్దు చేయబడుతుంది.
⦿ జమ్మూ తావి – సంబల్పూర్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 18310) సెప్టెంబర్ 7న రద్దు చేయబడుతుంది.
⦿ సంబల్పూర్ – జమ్మూ తావి ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 18309) సెప్టెంబర్ 9న రద్దు చేయబడుతుంది.
⦿ మాల్డా టౌన్ – సూరత్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 13425) సెప్టెంబర్ 6న రద్దు చేయబడుతుంది.
⦿ సూరత్ – మాల్డా టౌన్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 13426) సెప్టెంబర్ 8, 2025న రద్దు చేయబడుతుంది.
⦿ గోరఖ్‌పూర్ – సంబల్పూర్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 15028) సెప్టెంబర్ 8న రద్దు చేయబడుతుంది.
⦿ సంబల్పూర్ – గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 15027) సెప్టెంబర్ 9న రద్దు చేయబడుతుంది.
తాత్కాలికంగా రద్దు కానున్న రైళ్లు
⦿ గోరఖ్‌పూర్ – సంబల్పూర్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 15028) ఆగస్టు 23, 25, 27, 29, 31న తాత్కాలికంగా రద్దు అవుతుంది.
⦿ సంబల్‌పూర్ – గోరఖ్‌పూర్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 15027) ఆగస్టు 24, 26, 28, 30, సెప్టెంబర్ 1న తాత్కాలికంగా రద్దు అవుతుంది.
Read Also: ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లే ఆ రైళ్లలో అదనపు కోచ్‌లు.. ఇక బెర్త్ కన్ఫార్మ్ పక్కా!