Bone Health: వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం ఒక సాధారణ సమస్య. 50 ఏళ్లు దాటిన తర్వాత.. ప్రతి నాల్గవ వ్యక్తిలో ఈ సమస్య కనిపించడం ప్రారంభమవుతుంది. ఎముకలు మన శరీరానికి ఆధారం. అవి బలహీనంగా మారితే.. ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. చిన్నప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఇంతకీ ఎముకల ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తినాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలకు కొత్త బలాన్ని అందించే పాలు.. దేశీ నెయ్యి, బెల్లం, వెల్లుల్లి వంటి అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి.
పాలు, దేశీ నెయ్యి:
పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి మన ఎముకలను బలోపేతం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చెంచా దేశీ ఆవు నెయ్యి కలపడం వల్ల ఎముకలు లోపలి నుంచి బలపడతాయి. ఇది ఆర్థరైటిస్ , కీళ్ల నొప్పులు వంటి ఎముక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు దృఢంగా , ఆరోగ్యంగా మారాలని అనుకునే వారు నెయ్యి కలిపిన పాలు తాగడం చాలా మంచిది.
రాతి ఉప్పు, ఆవాల నూనె మసాజ్:
రాతి ఉప్పు , ఆవాల నూనెతో తయారుచేసిన హోం రెమెడీస్ కూడా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. ఆవాల నూనెలో రాతి ఉప్పును వేడి చేసి.. వారానికి రెండు నుంచి మూడు సార్లు శరీరానికి మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఎముకలు , కీళ్లలోని వ్యర్థ పదార్థాలు తొలగించడంలో ఉపయోగ పడుతుంది. మసాజ్ చేయడం వల్ల కీళ్ల దృఢత్వం , వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
వెల్లుల్లి, బెల్లం తినండి:
ఉదయం ఖాళీ కడుపుతో 1-2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని తరువాత.. ఒక చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. వెల్లుల్లిలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. అంతే కాకుండా బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను పునరుజ్జీవింపజేస్తుంది.
ఆకుకూరలు తినండి:
పాలకూర, మెంతి కూర, బతువా వంటి ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అవి ఎముకల సాంద్రతను కాపాడు కోవడానికి సహాయ పడతాయి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
Also Read: వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన ఫ్రూట్స్ ఇవే !
ఉదయం ఎండ:
సూర్యరశ్మి విటమిన్ డి యొక్క సహజ మూలం. ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి లేకపోవడం కూడా ఎముకల బలహీనతకు ఒక ప్రధాన కారణం. ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాలు సూర్యరశ్మిని తీసుకోండి. అలాగే.. యోగా లేదా వాకింగ్ ద్వారా ఎముకల బలాన్ని పెంచుకోవచ్చు.అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.