Jailer 2:సూపర్ స్టార్ రజినీకాంత్ ను మళ్లీ స్టార్ గా నిలబెట్టి ఆయనకంటూ పూర్వ వైభవాన్ని అందించిన చిత్రం జైలర్.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ఎప్పుడు ఈ సినిమాను మొదలు పెడతారు? ఎప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు? అనే అనుమానాలు అభిమానులలో వ్యక్తమవగా ఎట్టకేలకు ఈ సినిమాను ప్రకటించారు మేకర్స్.
కొంతకాలంగా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకున్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఒక చిన్న వీడియోని రిలీజ్ చేస్తూ విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో కథను ఎక్కడా రిపీట్ చేయకుండా రజినీకాంత్ ఐకానిక్ క్యారెక్టర్ టైగర్, అలాగే ముత్తువేల్ పాండియన్ రగ్గడ్ లుక్ ను మాత్రమే ఎలివేట్ చేస్తూ ఈ గ్లింప్స్ విడుదల చేశారు. పూర్తి ముఖాన్ని చూపించకుండా బ్యాక్ ప్రొఫైల్ నడక తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఈ గ్లింప్స్ కట్ చేశారు. ఇకపోతే ముత్తువేల్ పాండియన్ అంతకంటే ప్రమాదకరమైన మిషన్ లో ఉన్నట్లు మనకు హింట్ ఇచ్చారు. అక్టోబర్ 15వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇకపోతే అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో మేకర్స్ మాస్టర్ ప్లాన్ కి హ్యాట్సాఫ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దేవి శరన్నవరాత్రుల సెలవులు సందర్భంగా ఈ సినిమా రాక.. కలెక్షన్లు మరింత జోరు అందుకుంటాయి అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.ఇక్కడ ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సీక్వెల్ ను హాలీవుడ్ లెవెల్ లో ప్లాన్ చేశాడని మనకు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ , కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తమ పవర్ఫుల్ క్యారెక్టర్లతో రజనీకాంత్ కు తోడుగా నిలవనున్నారు.
also read:మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!
ఇక వీరితో పాటు రమ్యకృష్ణ , మిథున్ చక్రవర్తి, యోగి బాబు, ఎస్ జె సూర్య తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ కూడా కోలీవుడ్లోకి గ్రాండ్ గా డెబ్యూ ఇస్తున్నారు. ఇక మరో సర్ప్రైజ్ ఏమిటంటే బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ కూడా ఒక పవర్ఫుల్ క్యామియో పాత్ర పోషిస్తున్నారు. ఆయన తన సినిమా కింగ్ షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్లే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. ముఖ్యంగా ఈయన కనిపించేది రెండు నిమిషాలే అయినా ఆ పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా మారనుంది అని సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి మ్యూజిక్ అనిరుద్ రవిచందర్ అందించారు. ఇప్పటికే బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తున్న “హుకుం రీ లోడెడ్” సాంగ్ సోషల్ మీడియాలో రీల్స్ రూల్ చేస్తోంది. ఈ సినిమా మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని అటు ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు.