Tanu Shree Dutta: ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న తనుశ్రీ దత్త (Tanu Shree dutta) సడన్గా ప్రముఖ దిగ్గజ నటుడు నానాపటేకర్ (Nana Patekar) మృతి పై సంచలన కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంది. 75 ఏళ్ల వయసులో అక్టోబర్ 8న గోవాలోనే తన నివాసంలో గుండెపోటుకు గురైన ఆయనను హాస్పిటల్ కి తరలించినప్పటికీ , వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా నానా పటేకర్ మృతి చెందారు. దీంతో ఆయన మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తుంటే.. నానా పటేకర్ పేరు నేరుగా ప్రస్తావించకుండా తను శ్రీ దత్త సోషల్ మీడియాలో ఒక వీడియోని పంచుకుంది..
“నేను ఈ వార్త విన్నాను. అయితే వెంటనే ఎలాంటి స్పందన ఇవ్వాలో అర్థం కావడం లేదు. నేను లక్నోలో జరగబోయే ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తున్నాను. దానిపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాను. నేను ఒక కార్యక్రమం కోసం సిద్ధమైన సమయంలో ఈ వార్త వచ్చింది. ఈ వార్త కారణంగా మీడియా మొత్తం ఈ అంశం పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది” అని చెబుతూనే “ఈవిల్ డెడ్” అనే పదాన్ని ఉపయోగించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
అయితే దీంతో ఈమెపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కూడా “అతడు నన్ను క్షమాపణ అడగలేదు.. నేనెందుకు మన్నించాలి” అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. అలాంటి తను శ్రీ దత్త అక్కడితో ఆగకుండా మళ్ళీ సంచలన కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పోస్టులో..” నానా పటేకర్ ను నరకంలో కాల్చేయాలి. 18 ఏళ్లుగా నా జీవితాన్ని నరకంగా మార్చాడు. పై లోకంలో ఉన్న ఆత్మను ఘోరమైన బాధలు , హింసలు పీడించాలి. నేను ఇక్కడ బ్రతికి ఉన్నంతవరకు నీకు నరకం నుంచి విముక్తి లభించదు” అంటూ సంచలన పోస్ట్ పెట్టింది తను శ్రీ దత్త.
అయితే తను శ్రీ దత్త నానా పటేకర్ పై ఇంతలా ద్వేషం పెంచుకోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే.. 2018 మీ టూ ఉద్యమంలో భాగంగా నానా పటేకర్ పై తను శ్రీ దత్త లైంగిక ఆరోపణల కేసు పెట్టింది . 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్ ‘ సినిమాలోని ఒక పాట షూటింగ్ సమయంలో తన పట్ల నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఆరోపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది . ఈ వ్యవహారంలో తగిన ఆధారాలు లేకపోవడంతో నానా పటేకర్ కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
also read: నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!
ఇక తర్వాత సైలెంట్ గా ఉన్న ఈమె నానా పటేకర్ మరణం నేపథ్యంలో మరోసారి ఆరోపణల వ్యవహారం తెరపైకి వచ్చింది . ఇన్ స్టా వేదికగా ఒక వీడియో విడుదల చేయగా.. అందులో తాను తన జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలను వివరించింది. ” మీ టూ ఉద్యమం తర్వాత నా పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అప్పటివరకు వారానికి ఐదు రోజులు పని చేస్తూ ప్రపంచమంతా నిర్భయంగా తిరిగేదాన్ని. అయితే దీని తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో బహిరంగంగా చెప్పడం నావల్ల కావడం లేదు. అది వింటే కళ్ళతో మీ ముఖం తడిసిపోతుంది. 2018 నుంచే ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాను. 2024లో నా కారు బ్రేకులు ఫెయిల్ అయ్యేలా చేశారు. ఎక్కడికి వెళ్ళినా రౌడీలు వెంబడించేవాళ్లు” అంటూ తన బాధను వెల్లడించింది తను శ్రీ దత్త. మొత్తానికి అయితే నానా పటేకర్ కారణంగా తాను పడ్డ కష్టాన్ని , నరకాన్ని ఆమె ఈ విధంగా పంచుకుంది.