BigTV English

OTT Movie : అయ్యయ్యో పెంచిన వింత జంతువుతోనే ఆ పాడు పని… జెండర్ మార్చుకుని అది చేసే అరాచకం చూస్తే దిమాక్ ఖరాబ్

OTT Movie : అయ్యయ్యో పెంచిన వింత జంతువుతోనే ఆ పాడు పని… జెండర్ మార్చుకుని అది చేసే అరాచకం చూస్తే దిమాక్ ఖరాబ్

OTT Movie : కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, కొన్ని టెక్నీకల్ అంశాలు సినిమాకి పేరు తెస్తాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్‌ కు మంచి మార్కులే పడ్డాయి. దర్శకత్వలోపమే ఈ సినిమాకు మైనస్ అయింది. జన్యు ప్రయోగాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మనిషి DNA తో జంతువుల DNA ని కలిపి ఒక హైబ్రిడ్ జీవిని సృష్టిస్తారు. ఆతరువాత స్టోరీ హింసాత్మకంగా మారుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘స్ప్లైస్’ (Splice) కెనడియన్-ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. విన్సెంజో నటాలి దర్శకత్వంలో, ఆడ్రియన్ బ్రోడీ (క్లైవ్ నికోలి), సారా పోలీ (ఎల్సా కాస్ట్), డెల్ఫిన్ షానియాక్ (డ్రెన్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2010 జూన్ 4, థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది 2010 సిట్జెస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, 2011లో కెనడియన్ సినిమా ఎడిటర్స్ అవార్డు, డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ కెనడా అవార్డును గెలుచుకుంది.


కథలోకి వెళ్తే

క్లైవ్ నికోలి, ఎల్సా కాస్ట్ N.E.R.D. (న్యూక్లియిక్ ఎక్స్ఛేంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) కంపెనీలో జన్యు ఇంజనీర్లుగా పని చేస్తుంటారు. వీళ్ళు వైద్య ప్రయోజనాల కోసం జంతు DNAని కలపడం ద్వారా హైబ్రిడ్ జీవులను సృష్టించాలని కోరుకుంటారు. అనుకున్నదే ఫ్రెడ్, జింజర్ రెండు పురుగులాంటి జీవులను సృష్టిస్తారు. అయితే మానవ DNAని జోడించే తదుపరి దశకు కంపెనీ అనుమతి నిరాకరిస్తుంది. కానీ క్లైవ్, ఎల్సా రహస్యంగా ప్రయోగం కొనసాగిస్తారు. వాళ్ళు డ్రెన్ అనే హైబ్రిడ్ జీవిని సృష్టిస్తారు. ఇది మానవ, జంతు లక్షణాలతో వేగంగా పెరుగుతుంది. ఎల్సాతో డ్రెన్‌ తల్లిలాంటి బంధం ఏర్పరచుకుంటుంది. కానీ క్లైవ్ దానిని తప్పుగా భావిస్తాడు. డ్రెన్ త్వరగా శిశువు నుండి యుక్త వయస్సుకు చేరుకుంటుంది. ఇక ఈ ల్యాబ్‌లో రద్దీ పెరగడంతో, డ్రెన్‌ను ఎల్సా కు చెందిన ఫామ్‌కు తరలిస్తారు.

డ్రెన్ లో మాంసాహార లక్షణాలు పెరుగుతాయి. దానిని బందీగా ఉంచడం వలన విసుగు వస్తుంది. ఇంతలో డ్రెన్‌లోని ఉన్న మానవ DNA ఎల్సాదని తెలుసుకుంటాడు క్లైవ్. ఆమె ఎవరో దాత నుండి తీసుకున్నట్లు అబద్ధం చెప్పిందని గ్రహిస్తాడు. ఇప్పుడు డ్రెన్ కి లైం*గిక ఆకర్షణ పెరుగుతుంది. ఇది ఎల్సాకు షాక్ ఇస్తూ ఒక వివాదాస్పద సన్నివేశానికి దారితీస్తుంది. వీళ్ళు డ్రెన్‌ను అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. డ్రెన్ ఇప్పుడు ఆడ నుండి మగ రూపంలోకి మారుతుంది. మగ డ్రెన్ హింసాత్మకంగా మారి, క్లైవ్, గావిన్, వారి యజమాని విలియం బార్లోను చంపేస్తుంది. డ్రెన్, ఎల్సాపై కూడా దాడి చేస్తుంది. కానీ ఎల్సా దానిపై తీవ్రంగా విరుచుకుపడుతుంది. ఈ క్లైమాక్స్ ఉహించని విధంగా ముగుస్తుంది. డ్రెన్ ను ఎల్సా చంపుతుందా ? డ్రెన్ చేతిలో ఎల్సా బలవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : చేపల వేటకు వెళ్లి బద్ద శత్రువు చేతికి బలి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే స్టోరీ… ‘తండేల్’ మాత్రం కాదండోయ్

Related News

OTT Movies: ఆఫీసులో బాస్ రహస్య జీవితం.. ఏకంగా ఇద్దరు అమ్మాయిలతో.. ఒక్క వీడియోతో మొత్తం మటాష్!

OTT Movie: తనను ప్లేబాయ్‌లా మార్చిన ఆటగాడితో కూతురు ప్రేమలో పడితే? ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు!

OTT Movie : కూతురి చావుకి ప్రెగ్నెన్సీ తో రివేంజ్… ప్రాణాల మీదకి తెచ్చే దొంగతనం… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : రైతే కదా అనుకుంటే రప్పా రప్పా… ఒక్కొక్కడి దుమ్ముదులిపే రైతు బిడ్డ… ఇది కదా రివేంజ్ అంటే

OTT Movie : హనీమూన్ లో కొత్త జంట… దెయ్యం ఎంట్రీతో గుండెల్లో గుబులు… క్లైమాక్స్ వరకు అరాచకమే గురూ

Big Stories

×