E-Paper
Advertisement

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్!
Advertisement

Actor Siddarth: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ (Siddharth) ఇటీవల 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో.. భారత వైమానిక దళం సాధించిన వీరోచిత పోరాటం ఆధారంగా రూపొందించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేడ్ సాగర్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7న విడుదలైన విషయం తెలిసిందే. అలాంటి ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వెళ్లు వెత్తుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సిద్ధార్థ్ వెబ్ సిరీస్ ను నిలిపివేయాలంటూ డిమాండ్..

సిద్ధార్థ్, జిమ్మీ షేర్ గిల్ , దియా మీర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్, యాక్షన్ , భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో అమరవీరుడు అజయ్ అహుజా పాత్రలో నటించిన సిద్ధార్థ్ భౌతిక కాయాన్ని మోసుకెళ్ళే సన్నివేశం ఉంటుంది. ఆ సమయంలో ఆయన పేటికపై కప్పిన భారత జాతీయ జెండా అమరికపై శౌర్య చక్ర గ్రహీత , ఆర్మీ మాజీ కల్నల్ వేంబు శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..” జాతీయ జెండా నిబంధనల ప్రకారం కాఫిన్ జెండా కప్పేటప్పుడు కాషాయ రంగు తల వైపు ఉండాలని, కానీ ఈ సన్నివేశంలో తలకిందులుగా ఉంచారు “అంటూ సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా చూపించారు. ముఖ్యంగా ఈ దృశ్యంలో జరిగిన పొరపాటును డిజిటల్ గా సరిదిద్దాలని కూడా కోరారు. అంతేకాదు సవరణలు పూర్తి అయ్యేవరకు నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ను నిలిపి వేయాలని కూడా స్పష్టం చేశారు.

చిత్ర బృందం సవరిస్తుందా?

Advertisement

ఇకపోతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. సైనిక గౌరవాలు, జాతీయ జెండాకు సంబంధించిన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతూనే.. మేకర్స్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి వేంబు శంకర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నారు. మరి చిత్ర బృందం ఆయన చెప్పినట్టుగా వెబ్ సిరీస్ లోని సన్నివేశాన్ని డిజిటల్ గా చేంజ్ చేస్తుందా? లేదా ?అనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది.

ALSO READ: జెమినీ టీవీలో వినిపించే ఆ బేస్ వాయిస్ ఎవరిదో తెలుసా?

హీరో సిద్ధార్థ్ కి భారీ షాక్..

Advertisement

హీరో సిద్ధార్థ్ విషయానికొస్తే.. ఈ వెబ్ సిరీస్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ఈవెంట్లో కూడా ఆయన మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. పైగా తన చేతికి గాయమైనా సరే ప్రమోషన్స్ లో పాల్గొని వెబ్ సిరీస్ ను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాంటి ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చిక్కుల్లో పడడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Related News

నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

40 ఏళ్ల పెళ్లి బంధం… ఒక్క ట్రిప్‌తో బయటపడ్డ షాకింగ్ నిజం

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

హిందీలో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం.. ఎప్పుడంటే?

ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న రోజా రీ ఎంట్రీ మూవీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే?

రైతు కొడుకు నుంచి పూణే డాన్‌గా… షాకింగ్ క్రైమ్ డ్రామా

నైట్ డ్యూటీలో నర్సు… లగ్జరీ వృద్ధాశ్రమంలో రాత్రిపూట జరిగే షాకింగ్ వ్యవహారం

Big Stories

Advertisement
×