E-Paper
Advertisement

రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చిందోచ్.. ఫీచర్లు చూస్తే పూనకాలే.. ధర కూడా తక్కువే!

రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చిందోచ్.. ఫీచర్లు చూస్తే పూనకాలే.. ధర కూడా తక్కువే!
Advertisement

Realme 16x 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారత మార్కెట్లోకి తన కొత్త మిడ్-రేంజ్ ఫోన్ ‘రియల్‌మీ 16x 5G’ని అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలోనే అత్యుత్తమ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ ఫోన్‌ను రూపొందించింద. పవర్ ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ వంటి విభాగాల్లో ఇది గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలేంటో చూద్దాం.

కళ్లకు హాయినిచ్చే డిస్‌ప్లే

రియల్‌మీ 16x 5G ఫోన్.. 6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (HD+) ఐపీఎస్ ఎల్‌సీడీ (IPS LCD) డిస్‌ప్లేతో వస్తోంది. ఫోన్ వాడకంలో ఎక్కడా ల్యాగ్ లేకుండా అత్యంత స్మూత్‌గా పనిచేసేందుకు వీలుగా ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. మండుటెండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,200 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఫోన్ కిందపడినా తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌ను ఇచ్చారు.

పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6nm ప్రాసెస్ ఆధారంగా తయారైన ‘మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G’ (MediaTek Dimensity 6300) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు గేమింగ్‌ కు సైతం చాలా ఈజీగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 4GB / 6GB ర్యామ్.. 128GB / 256GB స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్ లో ఉంది. ఇక ఈ మెుబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘రియల్‌మీ UI 7.0’పై పనిచేయనుంది.

7,000mAh బ్యాటరీ..

తరచూ ఛార్జింగ్ పెట్టే పనిలేకుండా ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్ ద్వారా వేరే ఇతర పరికరాలను ఛార్జ్ చేసుకోవడానికి 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించడం గమనార్హం.

కెమెరా, ఇతర ఫీచర్లు

Advertisement

కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ వెనుక వైపు 50 MP ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 MP కెమెరా ఉంది. ఈ రెండు కెమెరాల ద్వారా 1080p క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్‌ల (30fps) వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. వైఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, USB టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 400% అల్ట్రా వాల్యూమ్‌ను అందించే బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌ను ఈ ఫోన్‌లో చేర్చారు.

Also Read: జియో మార్ట్‌ క్విక్ పంద్రాగస్టు సేల్.. 80% వరకు డిస్కౌంట్లు.. నిమిషాల్లో డెలివరీ!

ధర ఎంతంటే?

గురువారం (ఆగస్టు 13) మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ సేల్స్ అధికారంగా ప్రారంభం కానున్నాయి. 4GB + 128GB వేరియంట్ రూ.25,999, 6GB + 128GB మోడల్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ పై రూ.2000 ఎక్స్ ఛేంజ్ బోనస్, రూ.1000 తక్షణ డిస్కౌంట్ ను రియల్ మీ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు రియల్ మీ అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×