E-Paper
Advertisement

ఒకే ఫ్రేమ్‌లో మెగా పవర్…ఏపీ డిప్యూటీ సీఎంని కలిసిన గ్లోబల్ స్టార్!

ఒకే ఫ్రేమ్‌లో మెగా పవర్…ఏపీ డిప్యూటీ సీఎంని కలిసిన గ్లోబల్ స్టార్!
Advertisement

Ram Charan Meets Pawan Kalyan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన బాబాయ్, ఆంధ్రప్రదేశ్ నూతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కలవడం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ‘పెద్ది’ సినిమాతో సాలిడ్ సక్సెస్ చూసిన చరణ్,పవన్ కళ్యాణ్‌ను కలవడం మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.ఈ సాయంత్రం(జూన్ 24) జరిగిన ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ అండ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా 

అసలైతే రామ్‌చరణ్ అమరావతిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వెళ్తూ, దారిలో బాబాయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి మంగళగిరి ఆఫీస్‌కు వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. చరణ్ స్వయంగా వచ్చి బాబాయ్‌ని కౌగిలించుకుని, శాలువాతో సత్కరించి తన అభినందనలు తెలియజేశారు. ఈ క్రేజీ మీట్‌లో కేవలం రాజకీయాలే కాకుండా, ఫ్యామిలీ ముచ్చట్లు, సినిమా విశేషాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.

Advertisement

also read:ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత.. అసలు సంగతి ఇదే !

ప్రస్తుతం రామ్‌చరణ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటికే పెద్ది సినిమా 400కోట్ల పై చిలుకు వసూలు చేయడంతో నిన్న గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే.మరో వైపు పవన్ సుజిత్ తో OG 2 ని పట్టాలెక్కించడానికి ప్లాన్ వేస్తున్నట్టు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది.

Advertisement

బాబాయ్, అబ్బాయిలు కలిసి  స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారో 

ఇక ఇదిలా ఉంటె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఇద్దరి భేటీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అటు ఏపీఎల్ క్రికెట్ హంగామా, ఇటు బాబాయ్-అబ్బాయ్ ల పొలిటికల్ అండ్ సినీ గ్లామర్ కలగలిసి ఈ రోజును మెగా ఫ్యాన్స్‌కు ఒక మెమరబుల్ డేగా మార్చేసింది.చూడాలి మరి ఫోటోలకి కలిసి ఫోజులిచ్చిన ఈ బాబాయ్, అబ్బాయిలు కలిసి సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తారో !

also read:బోల్డ్ సబ్జెక్ట్‌తో సందీప్ కిషన్ ఫన్ రైడ్.. ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ అదిరిపోయిందిగా !

Related News

నూతన ప్రసాద్ ఇంట్లో మామిడికాయలు దొంగతనం చేసిన స్టార్ హీరో.. ఎవరంటే?

డ్యాన్సర్స్ అసోసియేషన్స్ లో ఉప ఎన్నికల ఫలితాలు.. చిరంజీవి మాటని కూడా లెక్క చేయని వైనం!

AAA ఓపెనింగ్.. ఆ సిటీపై బన్నీ మమకారం.. మరో దుబాయ్ కానుందా?

కొరియన్ కనకరాజు వెనుక వరుణ్ కష్టం.. నాగబాబు ఎమోషనల్ పోస్ట్!

స్టేజ్ పైనే ప్రముఖ నటికి లిప్ కిస్ ఇచ్చిన అభిమాని.. వీడియో వైరల్!

ఆస్తులతోపాటు దానధర్మాలు కూడా.. మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామాలివే!

4K లేజర్, డాల్బీ అట్మాస్.. వైజాగ్‌ AAA సినిమాస్ ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే!

తప్పు ఒప్పుకున్న అజయ్ భూపతి.. జయకృష్ణ విషయంలో అన్యాయం!

Big Stories

Advertisement
×