BigTV English

Alaska Earthquake: యుగాంతం ఎఫెక్ట్.. అమెరికాలో భారీ భూకంపం

Alaska Earthquake: యుగాంతం ఎఫెక్ట్.. అమెరికాలో భారీ భూకంపం

Alaska Earthquake: అమెరికాలోని అలాస్కా తీరంలో బుధవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక కాల‌మానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.


భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉంద‌ని అలాస్కాలోని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Also Read: ఇలా అయితే కష్టం బ్రదర్.! మారకపోతే యుద్ధంలో ఓడిపోతాం.. షాకిచ్చిన డిఫెన్స్ చీఫ్


“దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు NE) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడింది” అని కేంద్రం తెలిపింది.

కాగా, 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో భూకంపం బారిన పడింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం. అలాగే అది ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది. అలాస్కా గల్ఫ్, అమెరికా పశ్చిమ తీరం, హవాయిలను ముంచెత్తిన సునామీని సృష్టించింది. భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.

Related News

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Modi To Jinping: జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ.. మరింత బలోపేతం, ఏనుగు-డ్రాగన్ ఒక్కటవ్వాలి

Big Stories

×