E-Paper
Advertisement

కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!

కమిట్‌మెంట్ లేకుండా అవకాశాలు రావా..? ‘భాగ్య రేఖ’ఐశ్వర్య ఏం చెప్పిందంటే!
Advertisement

Bhagyarekha Ishwarya :ఐశ్వర్య వుల్లింగాల…‘చిట్టి తల్లి’, ‘భాగ్యరేఖ’, ‘రామసక్కని సీత’ వంటి సీరియల్స్‌లో పాటు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘జబర్దస్త్’ వంటి పాపులర్ కామెడీ షోలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తున్న సంగతి తెల్సిందే.ఇక తాజాగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఐశ్వర్య కెరీర్ మొదలెట్టినప్పటి నుండి పర్సనల్ లైఫ్ వరకు ఎన్నో విషయాలని పంచుకుంది.ముఖ్యంగా ఇందులో ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్స్ ఇవ్వాల్సిందే నా అన్న ప్రశ్నకి ఇలా సమాధానమిచ్చింది.ఇంతకీ ఐశ్వర్య వుల్లింగాల ఏమందో ఒకసారి చూద్దాం.

16 ఏళ్ల వయసులోనే

ఐశ్వర్య వుల్లింగాల మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారని తెలిపింది.దాంతో కుటుంబాన్ని నడిపే బాధ్యత పాటు,తన చదువుకి అలాగే తమ్ముడి స్కూల్ కీ తనే ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత తనపై పడిందని వాపోయింది. అయితే తన లైఫ్ సర్వైవల్ కోసం పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో తన తల్లి తనకు ఎంతగానో సపోర్ట్ చేసిందని తెలిపింది.ఇక డైరెక్టర్ కృష్ణ గర్గ్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచనమాల’ సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చానని ఆ తర్వాతే ప్రముఖ ఛానళ్లలో వరుస ఆఫర్లు దక్కించుకున్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా మొదటి ఏడాది నుంచే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలు అందుకున్నానని తెలిపింది.అయితే, నటన కంటే యాంకరింగ్, షో హోస్టింగ్ అంటేనే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాటని బయటపెట్టింది ఐశ్వర్య.

మరి కమిట్ మెంట్ ఏమైనా ఉందా

అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక డైరెక్టర్ కథ అంతా చెప్పి ఫైనల్ చేశాక మరి కమిట్ మెంట్ ఏమైనా ఉందా అని అడిగాడని, దానికి నేను చాలా కమిట్ మెంట్ తో వర్క్ చేస్తానని చెప్పానని ,నాకు అప్పుడది క్యాస్టింగ్ కౌచ్ అని తెలియలేదని, అయితే ఆ విషయం తెలిసాకా ఆ డైరెక్టర్ చెంప పగలకొట్టి బయటికి వచ్చానని జరిగిన విషయం బయటపెట్టింది.

Advertisement

ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకి అంతా ఒకే అయి రేపు అగ్రిమెంట్ అన్న సమయంలో ముందు రోజు రాత్రి కాల్ చేసి మరి కమిట్ మెంట్ ఏమైనా అని అడిగేవారని అలాంటి సినిమాలు నాకు వద్దని ఖరా ఖండిగా మొహం మీదే చెప్పేశానని తెలిపింది.ఏదైనా మన మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది.నన్నుగా గుర్తించిన వారే నాకు అవకాశాలు ఇస్తారని, బై గాడ్ గ్రేస్ నాకు ఇప్పటి వరకు ఎలాంటి గ్యాప్ రాలేదని తనమీద తనకున్న కాన్ఫిడెన్స్ ని బయటపెట్టింది.

లవ్ అనేది చాలా ప్రీషియస్

ఇక ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అయిన ఐశ్వర్య “లవ్ అనేది చాలా ప్రీషియస్”.కానీ, దానికి అర్హత లేని వ్యక్తులు జీవితంలోకి వచ్చినప్పుడు అది నిలవదు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి ఆలోచన కూడా లేదు” అని స్పష్టం చేసింది. ఇక బిగ్ బాస్ ఆఫర్ గురించి స్పందిస్తూ నాగార్జున గారి పక్కన తనను బిగ్ బాస్ స్టేజ్‌పై చూడాలనేది తన తల్లి కోరిక అని తెలిపింది.

ఇక ఐశ్వర్య వుల్లింగాల కెరీర్ విషయానికి వస్తే సీరియల్స్ లో సత్తా చాటుతున్న ఐశ్వర్య రాజీవ్ కనకాల, సాయి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాతో నేను’ సినిమాలో అలాగే ‘కామాఖ్య’ సినిమాలో నటించడం విశేషం. అలాగే ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లతో కలిసి ఓ ఓటీటీ (OTT) ప్రాజెక్ట్ తో పాటు కొన్ని ప్రముఖ వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలలో కనిపిస్తుందట ఐశ్వర్య .

also read :‘ఇరుముడి’ రిలీజ్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?

మొత్తంగా తన కెరీర్ లో ఎదురైన ఎన్నో సంఘటనలని బయట పెట్టిన ఈ ఇంటర్వ్యూ ఇపుడు నెట్టింట వైరల్ అవుతుంది !

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×